38.2 C
Hyderabad
April 28, 2024 21: 42 PM
Slider విజయనగరం

ప్రజా సమస్యల పరిష్కారానికై కదిలిన టీడీపీ…!

#tdp

ఎట్టకేలకు ప్రజా సమస్యలపై ప్రతిపక్ష టీడీపీ కదిలింది. ప్రధానంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు వస్తున్నాడనో లేక మరే ఇతర కారణాలైనా..టీడీపీ ముందడుగు వేసింది. ప్రధానంగా ఆవులకు వస్తున్న లంప్ స్కిన్ వ్యాధిపై అప్రమత్తం అయి చర్యలు తీసుకోవాలని విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ ను కోరింది.అలాగే జ్యోతిరావు పూలే వర్ధంతిని కూడా నిర్వహించింది.వివరాలు ఒక్క సారి చూస్తే.. చంద్రబాబు హాయాంలో నే విజయనగరం లోని కలెక్టరేట్ వద్ద జ్యోతిరావు పూలే విగ్రహ స్థాపనకు స్థలం ఇవ్వడం జరిగిందని టీడీపీ నేత కంది మురళి నాయుడు అన్నారు.

పూలే వర్థంతి సందర్భంగా విజయనగరం పోలీసు కంట్రోల్ రూం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి టీడీపీ నేతలంతా పూలదండ లు వేసారు. అనంతరం టీడీపీ నేతలు మాట్లాడారు… జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని…ప్రతీ ఒక్కరూ చదువు కోవిలని…తన భార్య ను కూడా చదివించిన మహోన్నత మైన వ్యక్తి అని టీడీపీ నేతలు కొనియాడారు.

ఇక్కడ అంటే నగరంలో ఆయన విగ్రహ స్థాపనకు టీడీపీ నే పూనుకుందని…ఈ స్థలాన్ని కూడా మా పార్టీ నే చూసిందని టీడీపీ నేత కంది మురళి నాయుడు అన్నారు. ఇక ఆవులకు వ్యాపిస్తున్న లంప్ స్కిన్ వ్యాధి పై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ ను టీడీపీ కోరింది. ఈ మేరకు జిల్లా కేంద్రంలో న్యూపూర్ణ వద్ద ఉన్న వీఎంసీ లో కమీషనర్ శ్రీరాముల నాయుడు ని టీడీపీ ప్రతినిధులు కనకల మురళీమోహన్, కంది మురళీనాయుడు ,ప్రసాదుల లక్ష్మీ వర ప్రసాద్, బొద్దుల నరసింగరావు లు కలిసా రు.

అనంతరం వీఎంసీ వెలుపల టీడీపీ నేతలు విలేకరులతో మాట్లాడుతూ… ఆవులపై…చిన్న పొక్కులు ,దెబ్బలలా ఇటీవలే కనిపిస్తోందని…పిల్లలు… అలాగే పశువుల పెంపకం దారులు వాటిని శుభ్రం చేసే క్రమంలో తగిలితే మనిషి వ్యాప్తి చెంది తద్వారా లంప్ స్కిన్ వ్యిధి వస్తుందని…తక్షణమే ఈ వ్యిధి నివారణకు చర్యలు చేపట్టాలని కోరామన్నారు. నగరం మొత్తం పశువులు ఉన్నాయని.. వాటికి ఇప్పటికే ఈ తరహా వ్యిధి వచ్చిందని మా పార్టీ పరిశోధించి ఈ నిర్ణయానికి వచ్చామని టీడీపీ నేతలు కోరారు.

Related posts

130 జ్యోతిరావ్ పూలే వ‌ర్థంతి

Sub Editor

జగన్ కేసు వచ్చే నెల 6కు వాయిదా వేసిన హైకోర్టు

Satyam NEWS

అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి ఇది

Satyam NEWS

Leave a Comment