38.2 C
Hyderabad
April 29, 2024 22: 05 PM
Slider ముఖ్యంశాలు

అధికారం కోస‌మే టీడీపీ మా పొట్ట కొడుతోంది…!

#vijayanagarammp

అధికారం కోసమే ప్రతిపక్ష పార్టీ టీడీపీ యత్నిస్తోందని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శీను విమర్శించారు. అమరావతి నుంచీ అరసవల్లి వరకు జరుగుతున్న పాదయాత్ర పై జేడ్పీ చైర్మన్ టీడీపీ నుంచి ఉద్దేశించి మాట్లాడారు.

రాష్ట్రంలో ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతమని మరీ ముఖ్యంగా విజయనగరం, సిక్కోలు జిల్లాలో ఎన్నో వనరులు ఉన్న గత పాలకులు నిర్లక్ష్యం కారణంగా వెనకబడిందన్నారు.కానీ జగన్ ప్రభుత్వం రాగానే ముఖ్యంగా విజయనగరం జిల్లాలో దీర్ఘకాలిక సాగు నీటి ప్రాజెక్టులు.. పెండింగ్ లో వాటికి నిధులు కేటాయించి పనులు చేపప్టడం జరిగిందన్నారు. విశాఖ ను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా నిర్ధారించి..లక్షల కోట్ల పలు ప్రాజెక్టుల కోసం సీఎం జగన్ కేటాయిస్తే… కో‌ర్టుకు ఎక్కిన టీడీపీ ఇప్పుడు అమరావతి నుంచే అరసవల్లి కి చేపట్టిన పాదయాత్ర కు మద్దతు పలకడం పనికిమాలిన చర్య అని అభిర్ణించారు…

జేడ్పీ చైర్మన్. గడచిన మూడేళ్ళ గా జరుగుతున్న అభివృద్ధి ని చూసి టీడీపీ ఓర్వలేక పోతోందన్నారు. ఈ క్రమంలో నే అమరావతి నుంచీ అరసవల్లి కి చేపట్టిన పాదయాత్ర కు సంఘం భావం తెలిపారని అన్నారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా…జగన్ ప్రభుత్వం లో పేదోడి కి చెయ్యాల్సిన ,అందాల్సిన, జరగాల్సిన న్యాయం కేవలం జగన్ ప్రభుత్వ హాయంలోనే జరుగుతుందని జేడ్పీ చైర్మన్ నొక్కి చెప్పారు.

అంత‌కుముందు . . విశాఖ‌ప‌ట్నం మ‌హాప్రాంత అభివృద్ది సంస్థ‌ (విఎంఆర్‌డిఏ) ఆధ్వ‌ర్యంలో, క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో జ‌రిగిన  కార్య‌క్ర‌మంలో 133 మందికి ఎంఐజి ఇళ్ల స్థ‌లాల కేటాయింపు ప‌త్రాల‌ను అంద‌జేశారు.ఈ సంద‌ర్భంగా జెడ్‌పి ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల క‌ల‌ను నెర‌వేర్చార‌ని అన్నారు.

ప్ర‌తీ ఒక్క‌రికీ సొంత ఇళ్లు ఉండాల‌న్న‌ది ముఖ్య‌మంత్ర ల‌క్ష్య‌మ‌న్నారు. రాష్ట్రంలో సుమారు 30 ల‌క్ష‌ల మంది పేద‌ల‌కు ఉచితంగా ఇంటి స్థ‌లాల‌ను కేటాయించిన ఘ‌న‌త ముఖ్య‌మంత్రికే ద‌క్కింద‌న్నారు. చిరుద్యోగులు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు కూడా జ‌గ‌నన్న స్మార్ట్ టౌన్ షిప్ కార్య‌క్ర‌మం క్రింద, అతి త‌క్క‌వ ధ‌ర‌కే అన్ని వ‌స‌తుల‌తో ఇళ్ల స్థ‌లాల‌ను అంద‌జేయ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. ఈ అవ‌కాశాన్ని మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకొని, ముఖ్య‌మంత్రి క‌ల‌ను నెర‌వేర్చాల‌ని ఛైర్మ‌న్ కోరారు.

Related posts

యడ్మ కిష్టారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కోదండరాం

Satyam NEWS

ఉగాది కానుక: 387 వలంటీర్లకు సేవారత్న అవార్డులు

Satyam NEWS

మాన‌వ‌సేవ నే మాధ‌వ సేవ: దాస‌న్న‌పేట‌లో చ‌లి వేంద్రం ప్రారంభం

Satyam NEWS

Leave a Comment