తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా వలిగొండకు చెందిన వెంకటేశ్వర్లు కొద్ది కాలంగా కేసీఆర్ ఫామ్ హౌస్ లో సెక్యూరిటీ డ్యూటీ చేస్తున్నాడు. ఏమైందో ఏమో కానీ AK 47 వెపన్ తో కాల్చుకొని వెంకటేశ్వర్లు చనిపోయాడు. గత కొంతకాలం గా వెంకటేశ్వర్లు విధుల కు సరిగా హాజరు కావడం లేదని పోలీసులు చెబుతున్నారు. అయితే భార్య విజ్ఞప్తి తో తిరిగి విధుల్లో చేరాడని అక్కడ హెడ్ గార్డ్ గా వెంకటేశ్వర్లు పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. కాల్చుకున్న సమయంలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు మద్యం మత్తు లో ఉన్నాడని కూడా అంటున్నారు.
previous post
next post