26.2 C
Hyderabad
September 9, 2024 18: 20 PM
Slider తెలంగాణ

కాంగ్రెస్ కే ప్రమాదం ప్రజలకు కాదు

CM-KCR-Telangana-Assembly

తెలంగాణలో ప్రజలకు గాని, రాష్ట్రానికి గాని ఎలాంటి ప్రమాదం లేదని, కేవలం కాంగ్రెస్ కు మాత్రమే ప్రమాదం ఏర్పడిందని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నారు. శాసనసభలో కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన విమర్శలకు సమాధానం చెబుతూ గత ఎన్నికలలో కాంగ్రెస్, బిజెపిలకు ప్రజలు తగిన రీతిలో సమాధానం చెప్పినా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. 2014 లో కాంగ్రెస్ కు 21 ఉంటే 2018లో 19 కి తగ్గిపోయాయని, బిజెపి సీట్లు నాలుగు నుంచి ఒకటికి తగ్గిపోయాయని, అయినా ఏదేదో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. గతంలో జానారెడ్డి చేసిన ప్రకటనలనే భట్టి చేస్తున్నారని ఆయన అన్నారు. హుజూర్ నగర్ లో ఇంతవరకు అసలు ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందే ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులను చేస్తోందని భట్టి ప్రచారం చేస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని ఆయన అన్నారు. తమకు అన్ని జిల్లాలలోను ప్రజలు మద్దతు కొనసాగుతోందని ఆయన అన్నారు. బడ్జెట్ పై తాను మాట్లాడిన తర్వాత వందల ఫోన్ లు వచ్చాయని అన్నారు. పక్క రాస్ట్రంలో ఎన్నికల ముందు తాయిలాలు ఇచ్చి భంగపడ్డారని చంద్రబాబును పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల టైమ్ లో ఒక్క జిల్లా కలెక్టర్ లేదా ఎస్పితో మాట్లాడలేదని , డిజిపి తో కూడా మాట్లాడలేదని ఆయన అన్నారు. ఒకే సందర్భంలో సిఈఓ చేసిన ప్రకటనను అమలు చేయండని మాత్రమే చెప్పానని ఆయన అన్నారు. ప్రజల మద్దతు లేకపోతే అధికారులు ఎవరూ కాపడలేరని కీసిఆర్ అన్నారు. తమ పార్టీ పుట్టిందే సాహసం మీద ఆయన అన్నారు. పార్టీ పెట్టినప్పుడే రాజీనామాలతో ఆరంభించామని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి పదవి, రాష్ట్ర మంత్రి పదవులు ,ఎమ్మెల్యేల, ఎంపి పదవులు వదలుకున్నామని, దేశ చరిత్రలోనే ఇది రికార్డు అని కేసిఆర్ అన్నారు. o

Related posts

ఎంపి రఘురామరాజుపై బూతులతో వైసీపీ నేత దాడి

Satyam NEWS

వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి?

Sub Editor

వి.ఎస్.యు. నూతన అసిస్టెంట్ ప్రిన్సిపాల్ గా డా. కోట నీల మని కంఠ

Satyam NEWS

Leave a Comment