30.7 C
Hyderabad
April 29, 2024 03: 22 AM
Slider ముఖ్యంశాలు

యునెస్కో గుర్తింపుపై తెలంగాణ జాగృతి హర్షం

#Telangana Jagruti

రామప్ప కి యునెస్కో గుర్తింపు రావడం చాలా ఆనందంగా వుందని తెలంగాణ జాగృతి నాయకులు అంతటి రాము, గునిగంటి హరీష్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా చిరంజీవి ఉన్నపుడే తెలంగాణ ప్రాంత కళా సంపదను కాపాడాలని, 13వ శతాబ్దం లోనే నిర్మించిన రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క కోరారని వారు తెలిపారు.

కవితక్క పిలుపుకి స్పందించి నాటి తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం నాయకులుగా అధికారులకు నివేదించారని తెలిపారు. ఈ గుర్తింపు తో రామప్ప ఆలయం అభివృద్ధి చెందుతూనే,ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుందని, ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు వీక్షీంచే శిల్ప కళా సంపద రామప్ప దేవాలయంలో వుందని వారు అన్నారు.

ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ కి దేవాలయాలు అభివృద్ధి పై ఆసక్తి ఎక్కవని, రాష్ట్ర ప్రభుత్వం కూడ రామప్ప దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెడుతుందని వారు అన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 2013లోనే రామప్ప దేవాలయాన్ని అంతర్జాతీయంగా గుర్తించాలని, విధ్యార్థి నాయకులు చేసీన కృషిని, వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ తెలంగాణ జాగృతి నాయకులను అభినందించారు.

ఆనాడు పాల్గొన్న నాయకులు పోశాల అభినాష్,చెన్న ప్రశాంత్,సుభాష్,మధుకర్,మహేష్, శ్రీకాంత్,వంశీ,తదితర విద్యార్థి నాయకులకు రాము,హరీష్ కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

నవంబర్ 4న చింతామణి సొంత మొగుడు చిత్రం విడుదల

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రంలో ఆర్.ఎస్.ఎస్ ప‌థ సంచ‌ల‌నం…!

Satyam NEWS

కౌంటింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు ఉండాలి

Satyam NEWS

Leave a Comment