తెలంగాణలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం హరితహారం మొక్కలను తిన్నందుకు రెండు మేకాలను అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు. కరీంనగర్ హూజురాబాద్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సేవ్ ద ట్రీ అనే స్వచ్చంధ సంస్థ జిల్లాలో ఉన్న స్కూల్స్ , కాలేజీల్లో దాదాపుగా 980 మొక్కలు ప్రభుత్వ సహాకారంతో నాటారు. అందులో దాదాపు 250 మొక్కలు వరకు మేకలు తినేశాయి. ఇదే అంశానికి సంబంధించి మేకల యజమానులకు పలుసార్లు ఫిర్యాదు చేశారు. కానీ వారు పట్టించుకోకపోవడంతో బుధవారం స్కూల్ ఆవరణలో మొక్కలను తింటున్న రెండు మేకాలను స్వచ్చంద సంస్థ సభ్యులు పోలీసులకు అప్పగించారు. ఎంతో వ్యవప్రయాసలతో మేము దాదాపు 980 మొక్కలను నాటమని అందులో దాదపు 250 మొక్కలు మేకలు తినడం వలనే చనిపోయాయి. అందుకే ఇలాంటి చర్యలు తీసుకున్నామని ఎన్జీవో సభ్యలు తెలిపారు. అయితే మేకల యజమానులకు 10 వేల రూపాయి జరిమాన వేసి పోలీసులు తరువాత మేకలను విడిచిపెట్టారు. తెలంగాణ ప్రభుత్వం హరితహారంలో భాగంగా కోట్ల రపాయిల ఖర్చు పెట్టి జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటారు. అందులో దాదాపు 33 శాతం మొక్కలు మాత్రమే మిగిలాయని ఎన్జీవో అధికారుల అంటున్నారు.