40.2 C
Hyderabad
April 29, 2024 16: 55 PM
Slider వరంగల్

వినియోగదారుల ప్రయోజనాలు కాపాడేందుకే ట్రాయ్ కృషి

#telecom

ములుగు జిల్లా కేంద్రంలోని మహర్షి డిగ్రీ కళాశాల కాన్ఫరెన్స్ హల్ లో టెలికాం వినియోగదారులకు, ప్రజలకు, విద్యార్థులకు టెలికాం సంబంధిత వినియోగాలపై అవగాహాన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కాగ్ సభ్యురాలు కల్లెపు శోభారాణి హాజరై మాట్లాడారు. ప్రపంచంలోనే టెలికాం రంగంలో భారతదేశం రెండవ స్థానంలో ఉందని,మొబైల్ వినియోగ దారులు టెలికాం సంస్థల నుండి ఉత్తమ సేవలు పొందేలా ఈ తరహా సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ పత్రాన్ని 2006లో తీసుకురావడం జరిగిందని, ఇప్పటివరకు 48 కోట్ల మంది వినియోగ దారులు వినియోగించుకున్నారన్నారు. అలాంటి కాల్ మొబైల్ వినియోగ దారులకు ప్రధాన సమస్యగా మారడాన్ని ట్రాయ్ గుర్తించి 1909 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఆలాంటి వారిపై ఫిర్యాదు చేస్తే ఆ నెంబర్ బ్లాక్ చేస్తామని అన్నారు. 2025 నాటికి అందరూ బ్రాడ్ బ్రాండ్ కలిగి ఉండేలా దేశ వ్యాప్తంగా 6 లక్షల గ్రామాల్లో అంతర్జాల సేవలు అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

టెలి మార్కెటింగ్ కాల్స్ ను అడ్డుకోవడానికి డు నాట్ డు (డి.ఎన్.డి)అనే యాప్ ను డౌన్ లోడ్ చేసి అందులో తమ నెంబర్ ను నమోదు చేసుకుంటే అనవసర వ్యాపార సంస్థల కాల్స్ రావని అన్నారు.ప్రతి ఒక్కరు టెలికాం రంగంలో పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అనంతరం అందరికీ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ డిపిఎం గోవింద్ చౌహాన్, వివిధ టెలికాం సంస్థల ప్రతనిధులు,ఎన్జీఓ ప్రముఖులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏపీలో మరింత మండనున్న ఎండలు

Satyam NEWS

భారీ వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి

Satyam NEWS

స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను వేగవంతం చేయాలి

Bhavani

Leave a Comment