28.7 C
Hyderabad
April 26, 2024 07: 07 AM
Slider హైదరాబాద్

దేవాల‌యాల‌ను సంద‌ర్శించిన టీఆర్ఎస్ యువ‌నేత‌

jalpally

జ‌ల్‌ప‌ల్లి శ్రీ‌రామ కాల‌నీలో నిర్మిత‌మ‌వుతున్న రామ మందిర నిర్మాణ ప‌నుల‌ను టీఆర్ఎస్ యువ‌నేత, మంత్రి, ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి త‌న‌యులు కార్తీక్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డిలు శుక్ర‌వారం ప‌రిశీలించారు. అనంత‌రం జ‌ల్‌ప‌ల్లి మెయిన్‌రోడ్డులో గ‌ల‌ ముత్యాల‌మ్మ‌దేవాల‌యాన్ని, స‌బితా ఇంద్రారెడ్డి కాల‌నీలోని హ‌నుమాన్ దేవాల‌యంలో స్వామివారిని ద‌ర్శించుకున్నారు.

ప‌ట్టాల వివాదంపై స్థానికుల‌కు కార్తీక్‌రెడ్డి హామీ

స‌బితా ఇంద్రారెడ్డి కాల‌నీలో నెల‌కొన్న ప‌ట్టాల వివాదంపై స్థానికులు కార్తీక్ రెడ్డికి విన్న‌వించారు. అప్పోస‌ప్పో చేసి తాము క‌ట్టుకుంటున్నఇళ్ళ‌ను అధికారులు వ‌చ్చి కూల్చివేస్తున్నార‌ని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయ‌న తాను ఈ విష‌యాన్నిమంత్రి స‌బితా ఇంద్రారెడ్డికి విన్న‌విస్తాన‌ని త‌ద్వారా అధికారుల‌తో మాట్లాడ‌తాన‌ని అనంత‌రం ల‌బ్ధిదారులు ఇళ్లు క‌ట్టుకోవ‌చ్చ‌ని హామీ ఇచ్చారు.

స్థానిక స‌మ‌స్య‌ల‌ను ఏక‌ర‌వు పెట్టుకోలేక‌పోయామ‌న్న నిర్వేదంలో మ‌హిళ‌లు

కాగా స‌బితా ఇంద్రారెడ్డి కాల‌నీలో నెల‌కొన్నస‌మ‌స్య‌ల‌ను కార్తీక్‌రెడ్డికి విన్న‌విద్దామంటే త‌మ‌కు అవ‌కాశం ద‌క్క‌లేద‌ని స్థానిక మ‌హిళ‌లు వాపోయారు. తాము నివ‌సిస్తున్నఈ కాల‌నీలో మంచినీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు ఏమీ లేవ‌ని వాపోయారు. చీక‌టి ప‌డ‌గానే జ‌ల్‌ప‌ల్లి చెరువు ప‌క్క‌నే ఉండ‌డంతో పురుగు బుట్రా ఇళ్ల‌లోకి వ‌స్తున్నాయ‌న్నారు. ఇక మంచినీటి పైప్‌లైన్‌లు లేక‌పోవ‌డంతో అనేక ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తోంద‌ని స్థానికంగా నివ‌సిస్తున్న ల‌క్ష్మీ అనే మ‌హిళ వాపోయింది.

ఇప్ప‌టికైనా టీఆర్ఎస్ యువ‌నేత కార్తీక్‌రెడ్డి త‌మ స‌మ‌స్య‌ల‌ను మంత్రి స‌బితా ఇంద్రారెడ్డితో తెలియ‌జేసి స్థానిక అధికారుల ద్వారా ఆయా స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భించేలా చొర‌వ తీసుకోవాల‌ని స్థానిక మ‌హిళ‌లు కోరారు.

కార్తీక్‌రెడ్డి వ‌స్తున్నవిష‌యాన్ని తెలుసుకున్న స్థానిక నేత‌లు ఆయ‌న‌కు పూల‌మాల‌, శాలువాలు వేసి స‌త్క‌రించారు. మ‌హిళ‌లు ఆయ‌న‌పై పూల‌వ‌ర్షం కురిపించారు.

ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక కౌన్సిల‌ర్లు, టీఆర్ఎస్ నాయ‌కులు, స్థానికులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం

Sub Editor

గుర్ల కేసులో పోలీసుల మానతాకోణం..బాధితురాలి భవిష్యత్ పైనే దృష్టి

Satyam NEWS

అక్టోబర్ 13నుంచి దసరా సెలవులు

Satyam NEWS

Leave a Comment