30.7 C
Hyderabad
April 29, 2024 04: 57 AM
Slider మహబూబ్ నగర్

అట్టడుగు వర్గాల శ్రమను దోచుకుంటున్న ప్రభుత్వం

#lower classes

ప్రభుత్వం అట్టడుగు వర్గాల శ్రమను దోచుకుంటుందని ఆంజనేయులు ఆరోపించారు.నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో మంగళవారం సిఐటియు జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు.
గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె 13వ రోజు సందర్భంగా నియోజకవర్గంలోని గ్రామపంచాయతీ కార్మికుల మొత్తం విధులు బహిష్కరించి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముట్టడికి కల్వకుర్తి చేరుకున్నారు.

పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం నుండి బస్టాండ్ వరకు తుఫాన్ ను సహితం లెక్కచేయకుండా ర్యాలీ నిర్వహించి దాదాపు రెండు గంటలపాటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ అట్టడుగు వర్గాలకు చెందిన గ్రామపంచాయతీ కార్మికుల శ్రమను ప్రభుత్వం దోచుకుంటుందని వారి ఆరోగ్యాలు పక్కనపెట్టి ప్రజల ఆరోగ్యాలే ముఖ్యం అనే ఉద్దేశంతో గ్రామపంచాయతీ కార్మికులు తమ విధులు నిర్వహిస్తున్నా కార్మికుల సమస్యలు వినడానికి పరిష్కరించడానికి ప్రభుత్వానికి చేతులు రావడంలేదని దుయ్యబట్టారు.

ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రాకుంటే శుక్రవారం జిల్లాలోని కలెక్టరేట్లు గ్రామపంచాయతీ కార్మికులు దిగ్భందించేది ఖాయమని హెచ్చరించారు.ఇప్పటికైనా స్పందించి గ్రామపంచాయతీ కార్మికులకు జీవో 60 ప్రకారం కేటగిరి వారిగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీవో 51ని సవరించి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని అదేవిధంగా ప్రమాద బీమా 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చిలుక బాల్ రెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాలస్వామి సిఐటియు జిల్లా నాయకులు కురుమయ్య గ్రామపంచాయతీ కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి నియోజకవర్గ గ్రామపంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

శాల్యూట్: పెద్ద మనసు ఉన్న చిన్న కానిస్టేబుల్

Satyam NEWS

పోలీసుల బెదిరింపుతో వృద్ధ దంపతుల బలవన్మరణం

Satyam NEWS

నవంబర్ 21న ముదిరాజ్ జండాపండుగ వాల్ పోస్టర్ ఆవిష్కరణ!

Satyam NEWS

Leave a Comment