23.7 C
Hyderabad
May 8, 2024 06: 07 AM
Slider ముఖ్యంశాలు

కేంద్రం వల్లనే వాహన రంగం కుదేలైంది  

#minister

దేశంలో వాహన రంగం కుదేలవ్వడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని రాష్ట్ర మంత్రులు కే‌టి‌ఆర్, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ లు  ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో లారీ యాజమానుల, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా ఉధృతితో లారీలు తిరగలేదనే ఉద్దేశంతో ట్యాక్స్ ను కూడా రద్దు చేశామని  చెప్పారు. కరోనాతో ఫిట్ నెస్ సర్టిఫికేట్స్ రెన్యూవల్ చేసుకోలేని కారణంగా రోజుకు 50 రూపాయల ఛార్జ్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ రద్దు చేశారని చెప్పారు. గ్రీన్ ట్యాక్స్ ను తగ్గిస్తామన్నారు. 12ఏళ్ల లోపు సర్వీసు ఉన్న వాహనాలకు రూ.1500, 12ఏళ్లకు పైగా సర్వీసు కలిగిన వాహనాలకు రూ.3000 ఉండేలా వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వాహనాల లైసెన్స్ లను అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయకుండా చూస్తామన్నారు. ఎక్కడైనా రవాణశాఖ అధికారులు ఇబ్బందులు పెడితే తమ  దృష్టికి తీసుకుని రావాలని కోరారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా పాటిస్తామన్నారు. అన్ని రంగాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందని చిల్లరమల్లర రాజకీయాలు చేసే వారికి బుద్ధి చెప్పాలన్నారు. లారీ డ్రైవర్లను, యజమానులను, కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని మాకు పేదలు కావాలి.. పెద్దలు కావాలి అని సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

Related posts

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అత్తిలి అప్పారావు మృతి

Satyam NEWS

రాంగోపాల్ వర్మ ను రాష్ట్ర బహిష్కరణ చేయాలి

Bhavani

ట్రాజెడీ: నేల రాలిన నెలల బాలుడు

Satyam NEWS

Leave a Comment