38.2 C
Hyderabad
April 27, 2024 15: 34 PM
Slider ప్రకాశం

జైభీమ్, రిపబ్లిక్ సినిమా స్టోరీ కాదు… ఇది నాగార్జున రెడ్డి స్టోరీ

#nagarjunareddy

జైభీమ్, రిపబ్లిక్ సినిమాలు చూశారా? చూడకపోయినా ఫర్వాలేదు…. జర్నలిస్టు నాగార్జున రెడ్డి చేస్తున్న పోరాటం చూస్తే ఆ రెండు సినిమాల కన్నా ఉత్కంఠభరితంగా ఉంది. ప్రజాప్రతినిధులు చేసే అక్రమాలపై పోరాటం చేస్తున్న క్రమంలో పోలీసులకు కూడా టార్గెట్ అయిన నాగార్జున రెడ్డి అనే జర్నలిస్టుకు మానవహక్కుల సంఘం బాసటగా నిలిచింది. ఇదొక్కటే జర్నలిస్టు నాగార్జున రెడ్డి పోరాటంలో మేలిమలుపు.

2019 లో జర్నలిస్ట్ నాగార్జున రెడ్డి పై జరిగిన హత్యా ప్రయత్నం కేసు లో నిందితులను కాపాడటంలో పోలీసుల పాత్ర పై  రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ప్రకాశం జిల్లా వేటపాలెం ప్రాంతంలో 2019 సెప్టెంబర్ 23 న జర్నలిస్టు నాగార్జున రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఈ దుష్ట కార్యక్రమం వెనుక ప్రధాన కుట్రదారులుగా మాజీ MLA ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారనేది నాగార్జున రెడ్డి ఆరోపణ.

చిన్నగంజాం పోలీస్ స్టేషన్ ఈ మేరకు ఆయన ఫిర్యాదు చేశారు. FIR NO. 133/2019 గా చిన్నగంజాం పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కేసును పోలీసులు విచారణ జరిపారు. అయితే పోలీసులు ఈ విచారణ సమయంలో కేసు నుంచి ప్రధాన నిందితులను తప్పించారు.

ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాస రావు ఎలియాస్ స్వాములు వారి రక్తబంధీకులు ఉన్నారని ఫిర్యాదులో పేర్కొనగా పోలీసులు వారిని కేసు నుంచి తప్పించారు. ఈ ప్రయత్నాన్ని చేసిన వారిలో ఇంకొల్లు CI రాజోలు రాంబాబు ఉన్నారని కూడా నాగార్జున రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కేసు నుండి తొలగించడం ద్వారా అసలు నేరస్తులను కాపాడి,  ఈ హత్యాయత్నం కేసును పూర్తిగా నిర్వీర్యం చేసి, భారీ అవినీతికి పాల్పడిన వారిలో జిల్లా SP సిద్దార్డ్ కౌసిల్, విచారణాధికారి టి.అశోకవర్ధన్ రెడ్డి కూడా ఉన్నారని నాగార్జున రెడ్డి మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఈ అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, ఈ కేసును పున:ర్విచారణజరిపి, ప్రధాన కుట్రదారులపై, ప్రధాన ముద్దాయిలపై కేసు నమోదు చేసి,  రక్షణ కల్పించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు నవంబర్ 15న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవహక్కుల కమీషన్ వారికి జర్నలిస్ట్ నాయుడు నాగార్జున రెడ్డి  ఫిర్యాదు చేశారు. దీనిపై కమీషన్ స్పందించింది.

నాగార్జునరెడ్డి ఫిర్యాదును విచారణకు స్వీకరించిన కమీషన్, HRC NO.838 OF 2021 కేసు నమోదు చేసి, నాగార్జున రెడ్డి పై జరిగిన హత్యా ప్రయత్నం కేసులో పోలీస్ లు వ్యవహరించిన తీరుపై, బాధితుడి ఆరోపణలను విశ్వాసంలోనికి తీసుకుని  సదరు కేసులో వాస్తవాలను గ్రహించడానికి గాను, నిజనిర్ధారణ కోసం అడిషనల్ ఎస్పీ అధికారి చేత  విచారణ జరిపించాలని ఆదేశించారు. ఈ నెల 29 లోపల నివేదిక సమర్పించాలని ప్రకాశం జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీచేసింది.

సదరు జిల్లా ఎస్పీ ఇచ్చే నివేదిక ఈ కేసులో కమీషన్ సరైన నిర్ణయం తీసుకోవడానికి దోహదపడుతుందని భావిస్తున్నట్లు కమీషన్ అభిప్రాయపడింది.

Related posts

ప్రజాస్వామ్యం, లౌకిక శక్తుల రక్షణే ధ్యేయం

Bhavani

మహాయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న

Bhavani

సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత

Murali Krishna

Leave a Comment