28.7 C
Hyderabad
April 28, 2024 04: 34 AM
Slider ఖమ్మం

సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత

#collector

గ్రీవెన్స్ డే లో ప్రజలు సమస్యల పరిష్కారానికి సమర్పించిన దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.  జిల్లా కలెక్టర్, ఐడిఒసి సమావేశ మందిరంలో గ్రీవెన్స్ డే నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. స్వీకరించిన దరఖాస్తులను పరిష్కారానికి ఆదేశాలు ఇస్తూ, సంబంధిత శాఖ అధికారికి అందజేశారు.  ఈ సందర్భంగా ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామానికి చెందిన అజిత, న్యూలక్ష్మీపురం గ్రామం నుండి ఎస్కె. ఖాదర్ లు తమకు సదరం క్యాంపులో పాల్గొనే అవకాశం కల్పించగలందులకు కోరగా, డిసిహెచ్ఎస్ కు తగు చర్యకై కలెక్టర్ ఆదేశించారు. వైరా మండలం, లింగన్నపాలెం గ్రామానికు చెందిన విశ్వబ్రాహ్మణులు, తాము బిసి కార్పొరేషన్ నుండి 2017-18 లో ఋణ మంజూరు కొరకు దరఖాస్తు చేసినట్లు, జాబితాలో పేర్లు వచ్చిన, ఋణం ఇప్పటికి మంజూరు కాలేదని, మంజూరు చేయించగలందులకు దరఖాస్తు చేయగా, జిల్లా బిసి సంక్షేమ అధికారిణి ని తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. రామాలయంగుడి, పాండురంగాపురం, ఖమ్మం నుండి బోయిన విజయలక్ష్మి తనకు డబల్ బెడ్ రూం ఇల్లు మంజూరుకు కోరగా, తహసీల్దార్ కు తగుచర్యకై ఆదేశించారు. బాణాపురం గ్రామం, ముదిగొండ మండలం నుండి శనగల రఘు, తన కుమార్తెకు వికలాంగుల పింఛను మంజూరు కు కోరగా, డిఆర్డీఓ ను తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. చింతకాని మండలం, కొదుమూరు గ్రామం నుండి ఎస్. రమాదేవి, తన భర్త కరోనా తో మృతి చెందారని, కరోనా ఆర్థిక సహాయం మంజూరుకు కోరగా, జిల్లా వైద్యాధికారిని తగుచర్యకై ఆదేశించారు. ఏన్కూరు మండలం, తిమ్మారావుపేట గ్రామం నుండి వేముల భూక్యా మున్య, తనకు బురదరాఘవపురం గ్రామ పంచాయతీ సర్వే నెం. 469 లో తన తండ్రి పేర 5 ఎకరాలు, తన తల్లి పేర 4.09 ఎకరాలు, మొత్తం 9.09 ఎకరాలు పట్టాభూమి ఉన్నట్లు, సర్వే నెంబర్ 469 కి బదులుగా 468 గా రెవిన్యూ శాఖ వారు నమోదుచేసినట్లు, తప్పును సరిచేసి, వారిపై చర్యలు తీసుకోవాలని కోరగా, తహసీల్దార్ కు తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు.

కూసుమంచి మండలం భగత్ వీడు తాండ నుండి బి. రమేష్, తాను బికాం చదివినట్లు,ఉపాధికి మీ సేవ కేంద్రం మంజూరు కు కోరగా, కలెక్టరేట్ పరిపాలన అధికారిని తగుచర్యకై ఆదేశించారు. నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం గ్రామం నుండి పాలడుగు శ్రీనివాసరావు, తనకు సర్వే నెం. 168 లో ఉన్న 0.32 గుంటల భూమికి ఈ-పాస్ బుక్ కొరకు కోరగా, తహసీల్దార్ కు తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. చింతకాని మండలం నాగిలిగొండ గ్రామం నుండి అరికోట్ల రామారావు, తనకు దళితబంధు మంజూరుకు కోరగా, ఎస్సి కార్పొరేషన్ ఇడి కి తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశమై, మండల ప్రత్యేక అధికారులుగా ఉన్న జిల్లా అధికారులు మండలాల సందర్శనకు వెళ్ళిన్నప్పుడు కంటి వెలుగు శిబిరాల తనిఖీలు చేయాలని, రోజువారి తక్కువ మొబలైజేషన్ ఉన్న కేంద్రాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి, శాఖల మధ్య సమన్వయం చేసి, లక్ష్యం మేరకు కంటి పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయా మండలాల్లోని మన ఊరు-మన బడి పనుల పురోగతిని పర్యవేక్షణ చేయాలని ఆయన తెలిపారు. ప్రతి తరగతి గది, వెనుక గోడపై మంచి పెయింటింగ్ లు వేయించాలని ఆయన అన్నారు. దళితబంధు పథకంలో డెయిరీ యూనిట్ల సేకరణలో మిగులు యూనిట్లు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూదన్, జిల్లా రెవెన్యూ అధికారిణి శిరీష, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆంధ్ర రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్న జగన్ రెడ్డి

Satyam NEWS

వెన్నెల రేడు

Satyam NEWS

10న రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్-2023

Bhavani

Leave a Comment