26.7 C
Hyderabad
April 27, 2024 07: 09 AM
Slider జాతీయం

వ్యాక్సినేషన్ తో పోటీ పడుతున్న కరోనా వైరస్

#CoronaVaccine

భారత్ లో కరోనా విజృంభణ రోజురోజుకీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలలో అనునిత్యం నమోదవుతున్న కొత్త కేసులలో అధికశాతం పల్లె ప్రాంతాలకు చెందినవి కావడం గమనార్హం. జనవరి 3 నుంచి 9 వ తేదీవరకు మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చిన మొత్తం కొత్త కేసులలో 36%  పల్లెలలో గుర్తించినట్లు లెక్కతేలింది.

అదే రాష్ట్రంలో ఫిబ్రవరి 21 ,27 తేదీల మధ్యకాలంలో బయటపడ్డ కేసులలో  అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లోనే (49%) కేసులు కొత్తగా నమోదైనట్లు ప్రభుత్వం చెబుతోంది.

పంజాబ్ లో ఆందోళనకర రీతిలో పెరుగుదల

పంజాబ్ రాష్ర్టంలో కూడా ఫిబ్రవరి 27 నాటికి గ్రామీణుల్లో కొత్తకేసులు 58 శాతానికి పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలతో పాటు హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్ ,జమ్మూ కాశ్మీర్ లలో కొత్తగా కోవిడ్ కేసులు విస్తరిస్తున్నాయి.

మరో ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే  మహారాష్ట్ర, పంజాబ్ లలో వాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతున్నట్లు సమాచారం. గ్రామీణుల్లో వైరస్ ఉద్ధృతిపట్ల సరైన అవగాహన లేకపోవడం ఒక కారణం కాగా సంబంధిత శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలం కావడంతో కోవిడ్ ప్రమాదఘంటికలు మోగి స్తోంది.

అప్రమత్తంగా లేకపోతే మళ్లీ విషాద పరిస్థితులు

పరిస్థితి ఇలాగే కొనసాగితే గతఏడాది మార్చినెలనాటి విషాద అనుభవాలు పునరావృతం కావచ్చని వైద్యరంగనిపుణులు, సాంక్రమిక వ్యాధుల శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

కేంద్రప్రభుత్వం ఇప్పటికే వైరస్ ప్రబలుతున్న రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వైరస్ డోసుల పంపిణీని సాధ్యమైనంత ఎక్కువమందికి ఇవ్వాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదేశించింది.

ఇప్పటికే కొత్తగా కేసులునమోదవుతున్న రాష్ట్రాలకు హద్దులలో ఉన్న రాష్ట్రాల మధ్య ప్రజల  రాకపోకలవిషయంలో చట్టాలను కఠినతరం చేయనుంది. పరిస్థితులు ఎప్పటికప్పుడు మదింపు చేసుకుని రాష్ట్రప్రభుత్వాలు వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టాలని కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది.

కోలుకుంటున్న స్థితిలో మళ్లీ దెబ్బ

కోవిడ్ విసిరిన పంజాదెబ్బకు సకల రంగాలు కుదేలయిన దుస్థితి నుంచి ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటున్న  దశలో మరోసారి కోవిడ్ విజృంభిస్తే సంభవించగల దుష్ఫలితాలు ఊహించడం కష్టం.

గతానుభావాలు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ యంత్రాంగం, పౌరసమాజం సత్వరం స్పందిస్తే రాగల కష్టనష్టాల తీవ్రతను గణనీయంగా నియంత్రించవచ్చని వస్తున్న సూచనలు అనుసరణీయం.

పొలమరశెట్టి కృష్ణారావు

Related posts

విశాఖ నారాయణ కాలేజీలో దారుణం

Satyam NEWS

ఒంటిమిట్ట సీతారాములకు తిరుమల శ్రీవారి కానుక

Satyam NEWS

పట్టణ ప్రగతిని పర్యవేక్షించిన అడిషనల్ కలెక్టర్ మను

Satyam NEWS

Leave a Comment