31.7 C
Hyderabad
May 2, 2024 08: 28 AM
Slider ఆధ్యాత్మికం

ధనుర్మాసం సందర్భంగా విజయనగరం ఏడు కోవెళ్లలో తిరుప్పావడ సేవ

#dhanurmasam

ధనుర్మాసం ప్రారంభమైన వేళ…ప్రతీ దేవాలయం లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యలనగరమైన విజయనగరం లో కూడా అన్ని దేవాలయాలలో ప్రత్యేక పూజలతో పాటు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఈ క్రమంలో విజయనగరం బాబా మెట్టలో వెలసిన ఏడు కోవెళ్లలో ధనుర్మాసం సందర్భంగా “తిరుప్పావడ” సేవ నిర్వహించారు… ఆలయ కమిటీ సభ్యులు.

ఈ మేరకు శివ పంచాయతన దేవాలయం( ఏడ కోవెళ్లు) లో వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసం సందర్భంగా 40 కేజీలు పులిహోర, ఇతర మధుర ఫలాలు, తినుబండారాలతో కలిపి వేంకటేశ్వరుని స్వరూపం లో తయారు చేసన తిరుప్పావడ సేవ నిర్వహించారు. ఈ తెల్లవారుజామున వేకువజామున గోదా దేవి కి, స్వామి వారికి ప్రేత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఈ తిరుప్పావడ సేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ సేవా లో పాల్గొని స్వామివారి కీర్తనలు ఆలపించారు.

ధనుర్మాసం ఈ నెల రోజులు ప్రతీ రోజు ప్రత్యేక కార్యక్రమలు నిర్వహిస్తనట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు రాజు తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం అర్చకులు.. భక్తులు కి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల ఆచార్యలు , ఆలయ కమిటీ అధ్యక్షులు కె.ఏ.పి.రాజు(శివ), కార్యదర్శి శివ కుమార్, కోశాధికారి సాంబమూర్తి, నారాయణ రావు, తేజ శర్మ, సభ్యులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జగన్ గురూజీ ఆధ్వర్యంలో వేసవిలో ఉచిత సేవలు

Satyam NEWS

పెద్ద‌గెడ్డ రిజ‌ర్వాయ‌ర్ ఆధునికీక‌ర‌ణ ప‌నుల ప్రారంభోత్స‌వం

Satyam NEWS

ఎటాక్:ఓటు వేయని వారిపై టిఆర్ఎస్ నాయకుడి దౌర్జన్యం

Satyam NEWS

Leave a Comment