38.2 C
Hyderabad
April 29, 2024 14: 48 PM
Slider ముఖ్యంశాలు

టీజేఎస్ యూత్ ప్రధాన కార్యదర్శిగా గొంగరెడ్డి వెంకటరెడ్డి

#TJSYouthWing

తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర యూత్ విభాగం ప్రధాన కార్యదర్శిగా గొంగరెడ్డి వెంకట్ రెడ్డి  ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కార్యాలయంలో జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం  నియామక పత్రాన్ని అందజేశారు.

గొంగరెడ్డి వెంకటరెడ్డి  సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మల్లారెడ్డి గూడెం(చింతలపాలెం) మండల కేంద్రానికి చెందిన వ్యక్తి. పాఠశాల స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలలో  ముందుండి అనేక విద్యార్థి సంఘాలలో  పని చేసిన అనుభవం ఆయనకి  ఉంది.

అంతేగాక  అనేక సేవా కార్యక్రమాలు,  స్వచ్ఛంద సంస్థల్లో సేవకుడిగా  పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించి,రసాయన శాస్త్రంలో అనేక జూనియర్ కళాశాలలలో ఐ ఐ టి అధ్యాపకుడిగా, ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, ప్రస్తుతం రీసెర్చ్ అసోసియేట్ గా పని చేస్తున్నారు.

ఓయు జెఏసీలో కీలక పాత్ర

ఒక వైపు ప్రైవేట్ ఉద్యోగం, మరోవైపు,సివిల్స్, గ్రూప్ 1 గ్రూప్ 2, ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ,తెలంగాణ ఉద్యమలో రాష్ట్ర కోసం పోరాటం చేశారు.మలి దశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా OU విద్యార్థి జేఏసీలో కీలకపాత్ర పోషించారు.

రాష్ట్రం  ఏర్పడిన నాటి నుండి  group 1 ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతూ,   తెలంగాణ నిరుద్యోగుల ఉద్యమ వేదిక స్థాపించి,ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం  ,నిరుద్యోగ సమస్య  పైన గత ఏడూ సంవత్సరాలలో (2014, 2018) వరకు పార్టీ తరుపున ఇప్పటివరకు అనేక నిరుద్యోగ సదస్సులు , నిరసనలు, పోస్ట్ కార్డ్ ఉద్యమం  నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించారు.

కొలువులకై కొట్లాట బహిరంగ సభ విజయవంతంలో కీలక పాత్ర పోషించారు. ప్రొఫెసర్ కోదండరాం  పిలుపు ఇచ్చే ప్రతి నిరసన కార్యక్రమంలో కీలకంగా పొల్గొని విజయ వంతం చేశారు.

కోదండరాం ప్రధాన అనుచరుడు

అనంతరం ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ప్రొఫెసర్ కోదండరాం  ఆశయాలకు ఆకర్షితుడై, 2018 లో జన సమితి పార్టీ ఆవిర్భావంలో కీలకంగా పని చేశారు.  పార్టీ ఏర్పాటులో మొదటినుంచి ప్రొఫెసర్ కోదండరాం  పట్ల నిరుద్యోగ సమస్యపై పోరాడి, అవగాహన ఉన్న యువజన నేతగా, నిరుద్యోగులను ఏకం చేయటంలో కోదండరాంకి ప్రధాన అనుచరుడిగా పేరు సంపాదించుకున్నారు.

ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో టీజేఎస్ పార్టీ యూత్ విభాగం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినందుకు ప్రొఫెసర్ కోదండరాంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రం తెచ్చుకున్నది ఉద్యోగాల కోసం అని, అమరవీరులు ఆనాడు 1200 మంది చనిపోయింది కేవలం ఉద్యోగాల కోసమే అని ,ఇప్పుడు అమరవీరుల ఆశయాలను కెసిఆర్  ఏమాత్రం పట్టించుకోవడంలేదని, ఉద్యమకారులకు ఆత్మ గౌరవం లేకుండా పోయింది అన్నారు.

రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయని కోటి ఆశలతో ఎదురు చూసిన నిరుద్యోగులను మోసం చేశారని, నిరుద్యోగులు ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూసి , నిరాశ నిస్పృహాలో ఉన్నారని అన్నారు.

నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం

కేసీఆర్ ప్రభుత్వం యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేక ఉపాధి చూపలేని పరిస్థితి ఉన్నదని, ఇస్తానన్నా నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ప్రభుత్వాన్ని విమర్శించారు. రానున్న కాలంలో తన బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వర్తించి యువజన సమితిని  రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు విస్తరింపజేసి యువజన సమితిని మరింత  బలోపేతం చేసి, యావత్తూ నిరుద్యోగులు అందరిని ఏకం చేసి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటం చేసి, ఉద్యోగాలు సాధిస్తాం,అని వెంకటరెడ్డి అన్నారు.

రాబోయే నల్లగొండ, వరంగల్ ,ఖమ్మం ,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం  గెలుపు కోసం కృషి చేస్తానని, తెలంగాణ తెచ్చిన రాష్ట్ర సాధన కర్త, ఉద్యమ సారథి,ప్రొఫెసర్ కోదండరాం చట్టసభల్లో ఉండాల్సిన అవసరం ఇప్పుడు వచ్చిందని, నిరంకుశ పాలనను అంతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

 పట్టభద్రుల మిత్రులు, ప్రైవేట్ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు,లెక్చరర్స్ ,ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకొని ప్రొఫెసర్ కోదండరాంకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకుని శాసనమండలికి పంపి ప్రజా గొంతును కాపాడుకుందామని వెంకటరెడ్డి అన్నారు.

Related posts

మేము సైతం అంటూ పోటీలకు సిద్ధపడ్డ భవాని,శ్రీజ

Satyam NEWS

శ్రద్ధాను శారీరకంగా హింసించిన ఆఫ్తాబ్

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: వేములవాడ రాజన్న ఆలయం మూసివేత

Satyam NEWS

Leave a Comment