40.2 C
Hyderabad
April 29, 2024 15: 53 PM
Slider ఖమ్మం

నాటి కేసీఆర్ దీక్ష ఫలితమే నేటి తెలంగాణ

#ajay

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్  చావు నోట్లో తల పెట్టీ, తెలంగాణ వచ్చుడో  కేసిఆర్ సచ్చుడో  అనే నినాదంతో నవంబర్ 29, 2009న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని గొప్ప మలుపు తిప్పిందని, చరిత్ర గతినే మార్చి వేసిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అన్నారు. అప్పటిదాకా నడుస్తున్న శాంతియుత ఉద్యమానికి, ఒక సత్యాగ్రహ ఆయుధంలా మారిందన్నారు. మొత్తం ప్రజలని ఏకం చేసి, ఆనాటి కేంద్ర ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించిన కేసీఆర్  దీక్ష చేపట్టిన రోజుని దీక్షా దివస్ గా జరుపుకోవడం, కెసిఆర్  త్యాగ నిరతిని గుర్తు చేసుకోవడమే అన్నారు.  దీక్షా దివస్ 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అప్పటి ఉద్యమ జ్ఞాపకాలు గుర్తుకు వస్తే ఒళ్ళు పులకరిస్తుంది అన్నారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను కూడా మరువలేమని మంత్రి గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సాధించిన కెసీఆర్  రాష్ట్రానికి సీఎం గా తెలంగాణను అదే ఉద్యమ స్ఫూర్తితో బంగారు తెలంగాణ చేస్తున్నారని వివరించారు. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని అద్భుతమైన ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలతో తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఉందన్నారు. సీఎం కెసిఆర్ త్యాగ నిరతికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపురోగాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తు, భవిష్యత్ తరాలకు మార్గదర్శకుడు, అంత గొప్ప మహా మనిషి మనకు సీఎం గా ఉండటం మన అదృష్టమని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.

Related posts

ఫీడ్ బ్యాక్: స్వచ్ఛమైన నగరం కోసం ఓటు వేయండి

Satyam NEWS

కండోలెన్స్: మాజీ జడ్పీ చైర్మన్ అశోక్ రాజు మృతి

Satyam NEWS

కొల్లాపూర్ అభివృద్ధిపై జూపల్లి క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment