38.2 C
Hyderabad
April 27, 2024 18: 16 PM
Slider ముఖ్యంశాలు

ఏపి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్?

#totachandrasekhar

జనసేన పార్టీ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ BRS పార్టీ లో చేరనున్నారు. హైదరాబాదులో రేపు తెలంగాణ సీఎం కేసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ తీర్ధాన్ని పుచ్చుకోనున్నారు. అదే రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ పేరును కేసీఆర్ ప్రకటించనున్నారు. తోట చంద్రశేఖర రావు బీ ఆర్ ఎస్  పార్టీలో చేరికతో ఆంధ్రప్రదేశ్ లో మరి కొంతమంది అధికారులు ఆయనతోపాటు వచ్చే ఎన్నికల్లో బీ ఆర్ ఎస్  పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. జనసేన పార్టీలో కాపు సామాజివర్గానికి చెందిన తోట చంద్రశేఖర రావు చిరంజీవి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీలో కూడా పని చేశారు.

Related posts

ఏపీపీఎస్సీ గ్రూప్1 మెయిన్స్ ఫలితాల వెల్లడి

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీలో చేరిన తెరాస బహిష్కృత మున్సిపల్ కౌన్సిలర్

Satyam NEWS

వ్యక్తిని చావబాది.. నోట్లో మూత్రం పోసిన జులాయిలు

Bhavani

Leave a Comment