26.7 C
Hyderabad
April 27, 2024 07: 27 AM
Slider అనంతపురం

మీడియా పేరు చెప్పాడు… దోపిడి చేస్తున్నాడు

#fake journalist

అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువకుడు నకిలీ విలేకరి అవతరమెత్తి ఏలూరులో పోలీసులకు చిక్కాడు. ఏలూరు లో బుధవారం జరిగిన ప్రెస్ మీట్ లో  డి ఎస్ పి  దిలీప్ కిరణ్ నకిలీ విలేకరి వివరాలు వెల్లడించారు.

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన ముంతేల సురేష్ (24) ఇంటర్ వరకు చదువుకున్నాడు. పేస్ బుక్ ద్వారా   పెదవేగి మండలం న్యాయంపల్లికి చెందిన ఒక యువతితో పరిచయం పెంచుకుని 2019లో   వివాహం కూడా చేసుకున్నాడు.

కష్టపడకుండా డబ్బు సంపాదించాలని అడ్డదారులు ఎంచుకున్నాడు. నకిలీ విలేకరి అవతారమెత్తి ఏకంగా స్టేట్  ఇన్వెస్టిగేషన్ బ్యూరో గా చెప్పుకుంటూ బ్లాక్ మెయిల్ కు మోసాలకు పాల్పడుతున్నాడని పెడవేగి ఏలూరు పోలీసులకు సమాచారం అందింది.

ఇతనిపై పోలీసులు నిఘాపెట్టి ఇతని కార్యకలాపాలపై ఆరాతీశారు. ఇతడు నకిలీ విలేకరి ముసుగులో ఇసుక, మట్టి తరలించే ట్రాక్టర్ ల  వారి వద్ద డబ్బులు వసూలు చేస్తూ అవికూడా సరిపోక అక్రమ మద్యం వ్యాపారం చేసేవాడు.

కొంత మంది నిరుద్యోగులకు మీడియాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేస్తున్నట్టు తెలుసుకున్న పెద వేగి ఎస్ ఐ సుధీర్ డి ఎస్ పి దిలీప్ కిరణ్ ఆదేశాల మేరకు రూరల్ సి ఐ అనసూరి శ్రీనివాసరావు నేతృత్వంలో బుధవారం న్యాయం పల్లిలో నకిలీ విలేకరి సురేష్ ను అరెస్ట్ చేశామని డి ఎస్ పి దిలీప్ కిరణ్ తెలిపారు.

Related posts

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. కిలో పాలపొడి రూ.1,195

Sub Editor

కేంద్ర ఎన్నికల సంఘం అధికారులపై మర్డర్ కేసు

Satyam NEWS

టార్గెట్ పవన్ కల్యాణ్: చేసెయ్ తప్పుడు ప్రచారం

Satyam NEWS

Leave a Comment