32.7 C
Hyderabad
April 27, 2024 00: 43 AM
Slider నెల్లూరు

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో బోధనేతర సిబ్బందికి శిక్షణా తరగతులు

#simhapuri university

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నేటి నుంచి రెండు రోజుల పాటు బోధనేతర సిబ్బందికి శిక్షణా తరగతులు ప్రారంభించనట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయ క్రిష్ణ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యా అతిధిగా వర్సిటీ రెక్టర్ ఆచార్య ఎం చంద్రయ్య విచ్చేసి మాట్లాడుతూ ఉన్నత విద్యలో ముఖ్యంగా విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న కార్యాలయ సిబ్బంది ఆఫీస్ మేనేజ్‌మెంట్ కోసం అవసరమైన మెలకువలు నేర్చుకుంటూ సంస్థకు ఉపయోగపడే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

అదేవిధంగా ప్రతి శాఖలోని సిబ్బంది ఫైల్ పెట్టేటప్పుడు రూల్ పొజిషన్ ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. సంస్ధ విజయవంతంగా నడపాలంటే సిబ్బంది వారి వారి నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా ప్రమోషన్స్ కూడా పొందవచ్చునని తెలిపారు.

అధ్యక్షత వహించిన వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయ క్రిష్ణ రెడ్డి మాట్లాడుతూ వర్సిటీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది ఒరిమెంటేషన్ విడతల వారిగా ఖచ్చితంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఇప్పుడు పని చేస్తున్న సిబ్బంది ఖచ్చితంగా ఆఫీస్ పనులన్నీ ఈ – ఆఫీస్ ద్వారా మాత్రమే నిర్వహించాలని తెలిపారు. సిబ్బంది శిక్షణతీసుకోవడం వలన ఆత్యన్నతమైన సేవలను విద్యార్థులకు,కళాశాలల వారికి అందించడానికి వీలుకలుగుతుందని తెలిపారు పునశ్చరణ జరగడం వలన నైపుణ్యలను పెంపొందించుకోగలుగుతారని తెలిపారు.

శాస్త్రీ యంగా, ప్రణాళిక బద్ధంగా సిబ్బంది పని చేయడం వలన వివిధ స్థాయిలలో రావలసిన ప్రమోషన్స్ కూడా వస్తాయని తెలిపారు. ఇందులో భాగంగా పరీక్షల నియంత్రణ అధికారి డా సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడతూ ఈ రోజు నిర్వహించిన శిక్షణ తరగతులు సిబ్బంది వారు ఏమి చేయకూడదో ఏమి చేయవచ్చు అనే విషయం తెలుస్తుందని తెలిపారు.

ఇటువంటి వర్సిటీ కార్యక్రమాలు మొదటిగా నిర్వహించడం జరిగినదని తెలిపారు. అదేవిధంగా రిసోర్స్ పర్సన్స్ గా  ఎ.బాల బాబు రెడ్డి,  రిజిస్ట్రార్ ఎల్ విజయ క్రిషి రెడ్డి,  ఈ – ఫైలింగ్ ఫారం – తయాచేసే పద్ధతి ఆఫీసు సంబంధించిన పనులపై టి డి యాస్ మరియు జి ఎస్ టి ఏ విధంగా తయారు చేయాలో తెలియచేసారు.

డీన్ ఆచార్య జి విజయ నంద్ కుమార్ బాబు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలవలన సిబ్బంది తమ నైపుణ్యలను పెంచుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా డా సుజయ్ కుమార్ వ్యవహరించారు కార్యక్రమంలో సూపరింటెండెంట్ జి రామక్రిష్ణ, జూనియర్ అసిస్టెంట్  యసదని బాష, జూనియర్ అసిస్టెంట్  జయసింహ, కె సురేష్ జూనియర్ అసిస్టెంట్ మరియు అధ్యాపకేతర సిబ్బంది , కావలి పి జి సెంటర్ అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేసిన వ్యాపారులు

Satyam NEWS

జెట్ స్పీడ్: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

Satyam NEWS

స్వాగతం శుభకృతు

Satyam NEWS

Leave a Comment