28.7 C
Hyderabad
April 28, 2024 09: 19 AM
Slider ముఖ్యంశాలు

తప్పు చేయని ఆదివాసీ బిడ్డకు అన్యాయం చేసిన ఉన్నతాధికారులు

#srikanya

అక్రమ సంబంధాన్ని అడ్డుకుని విలువలను కాపాడాలని చూసిన ఒక ఆదివాసీ బిడ్డను అన్యాయంగా ఉద్యోగం నుంచి తీసేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో కెజిబివి స్పెషల్ ఆఫీసర్ (SO) గా పని చేస్తున్న ఆదివాసీ (ST) బిడ్డ మేడ శ్రీకన్య దీనగాధ ఇది. మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం కోమట్లాగూడెం గ్రామానికి చెందిన శ్రీకన్య ఎమ్ఏ, బీఈడీ చదివింది.

నిరుపేద గా పుట్టినా చిన్నతనం నుంచి కష్టపడి చదివి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి పలు పోటీ పరీక్షలలో నెగ్గింది. చివరకు కెజిబివి స్పెషల్ ఆఫీసర్ (SO) గా మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఉద్యోగాన్ని పొందింది. అదే స్కూల్లో ఏఎన్ఎమ్ గా సోలం రాధ పని చేస్తున్నారు. ఆమె భర్త సోలం సాగర్ కేజీబీవీ స్కూల్ ముందు కిరాణంకొట్టు నడిపేవాడు.

స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని తరచూ స్కూల్ కు గైర్ హాజర్ అయ్యేది. ఆ విద్యార్థినికి సెలవు మంజూరు చేయాలని ANM రాధ తరచూ శ్రీకన్య పై వత్తిడి తెచ్చేది. అదేపనిగా ఆ అమ్మాయి విషయంలో వీరు చేస్తున్న ఒత్తిడిపై శ్రీకన్య కు అనుమానం వచ్చింది. దాంతో శ్రీకన్య పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆ విద్యార్థిని ANM రాధ భర్త సాగర్ తో చెడుతిరుగుళ్లు తిరిగేవాడని శ్రీకన్యకు తెలిసింది.

ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు విషయం మొత్తం తెలుసుకుని ANN రాధను, స్పెషల్ ఆఫీసర్ అయిన శ్రీకన్యను బాధ్యులుగా చేస్తూ ఉద్యోగం నుంచి తొలగించారు. ఇది జరిగి సుమారు రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికి తన తప్పు లేదని తెలిసి కూడా తనను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడానికి జాప్యం చేస్తున్నారని శ్రీకన్య వాపోతున్నది. సంబంధించిన అధికారులను కలిసినప్పటికి కూడా ఎలాంటి స్పందన రాలేదు. ఏ తప్పు చేయని తన పై చర్య తీసుకుని ఉద్యోగం నుంచి తొలగించి తనను మానసికంగా, ఆర్ధికంగా, ఉద్యోగపరంగా అన్యాయం చేసారని శ్రీకన్య వాపోతున్నది.

Related posts

మహిళలకుసమాజంలో గొప్ప స్ధానo

Murali Krishna

ప్ర‌తిప‌క్ష నేత బాబు టూర్ ప్రమోషన్ కోసమే త‌ప్పుడు ఆరోప‌ణ‌లు

Satyam NEWS

వ్యభిచార గృహం నడుపుతున్న మహిళాఎస్ఐ తల్లి తమ్ముడు

Satyam NEWS

Leave a Comment