38.2 C
Hyderabad
April 27, 2024 15: 13 PM
Slider ఖమ్మం

గిరిజన ప్రాంత సమగ్రాభివృద్ధి సీఎం కేసీఆర్ లక్ష్యం

#kcr

తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీల రాజకీయ సాధికారత, గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కొత్తగా మంజూరు చేసిన పనులకు ప్రభుత్వo అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. అనుమంతించబడిన బిటి రోడ్ల పనుల పర్యవేక్షణ పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆధ్వర్యంలో జరుగునుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్టీ అభివృద్ధి నిధులతో మంజూరైన బిటి, సిసి రోడ్ల పనులను వెంటనే ప్రారంభించేందుకు పంచాయతీ రాజ్ విభాగం తక్షణ చర్యలు చేపట్టింది.

ఆయా ప్రాంతాల స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి అధికారులు రోడ్ల పనుల సర్వేలను నిర్వహిస్తున్నారు. ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం పాపకొల్లు నుంచి ఏనుకూరు మండలం బురధరాఘవాపురం వరకు రూ.9.75 కోట్ల అంచనాతో ప్రభుత్వం మంజూరు చేసిన 13 కిలోమీటర్ల బిటి రోడ్ల పనులు చేపట్టుటకు స్థానిక సర్పంచుల సమక్షంలో పంచాయతీరాజ్ విభాగం అధికారులు సర్వే కసరత్తు చేస్తున్నారు.

ప్రభుత్వం నిర్దేశించిన 6 నెలలలో పనులు పూర్తి చేయనున్నారు. వాగులు, వంకల పైన నిర్మించే పనులను గుర్తించి మార్కింగ్ చేస్తున్నారు. మొత్తం 13 కిలోమీర్లలో 10.80 కిలోమీటర్లు మేర రోడ్డు పొలాలు, గిరిజన గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కొంత ఏరియా అటవీ ప్రాంతంలో ఉంది. కనెక్టివిటీ లేని ఎస్టీ ఆవాసాలను కనెక్టివిటీలోకి తెచ్చేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం పట్ల గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ బిటి రోడ్లు అందుబాటులోకి వస్తే గిరిజనులకు రవాణా సౌకర్యాలు మెరుగై విద్య, వైద్యం, నిత్యావసర వస్తువులు తదితర అనేక సౌలభ్యాలు కలిగి ఎన్నో రకాలుగా ప్రయోజనాలు పొందేందుకు వీలుపడుతుంది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో దశాబ్ధాలుగా జనజీవన స్రవంతికి దూరంగా ఉన్న వేలాది తాండాలు, గూడేలు సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలతో స్వయంపాలన, సాధికారతలతో వెలుగులోకి రావడం సాధ్యమైంది.

మన ప్రభుత్వం- మన పాలనకు చిహ్నంగా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు కలిసి పనులను వేగంగా పూర్తి చేయుటకు కార్యాచరణ రూపొందించారు. గత నాలుగేళ్లుగా ఈ రోడ్డు నిర్మాణం, అభివృద్ధి కోసం స్థానిక శాసనసభ్యులు రాములు నాయక్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన కృషి ఫలితంగా ఎట్టకేలకు విధులు మంజూరు కావడంతో ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక కూడా తీరనుంది. బిటి రోడ్డు నిర్మాణంతో గిరిజనుల జీవితాల్లో బంగారు బాటలు వేసిన ఘనత ఖచ్చితంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వానిదే అని ఎమ్మెల్యే రాములు నాయక్ స్పష్టం చేస్తున్నారు.

అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ గిరిజన గ్రామాలు ప్రజలకు ఈ బిటి రోడ్ల నిర్మాణంతో రవాణా సదుపాయం పెంపొందుతుందని, ఎమ్మెల్యే రాములు నాయక్ కృషి పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డీపీఆర్ఈ సుధాకర్, డిఇఇ సత్యనారాయణ ఈ పనుల పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టనున్నారు.

Related posts

పేకాట డెన్ లో దొరికిన కొల్లాపూర్ మాజీ, తాజా నేతల అనుచరులు

Satyam NEWS

అమిత్ షా ను కలసిన ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

Satyam NEWS

విజయనగరం జనసేన పార్టీ లో ప్రముఖ పారిశ్రామిక వేత్త కొడుకు..!

Satyam NEWS

Leave a Comment