29.7 C
Hyderabad
April 29, 2024 08: 01 AM
Slider ఖమ్మం

టిఎస్ ఐపాస్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి

#TS iPass

జిల్లాలో యూనిట్ల స్థాపనకు టిఎస్‌-ఐపాస్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులను వెంట వెంటనే పరిష్కరించి, అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అన్నారు. ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి టీఎస్‌-ఐపాస్‌ కమిటీ సమావేశాన్ని కలెక్టర్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 61 యూనిట్ల స్థాపనకుగాను 100 అనుమతులకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయన్నారు. 88 దరఖాస్తులను అనుమతించడం జరిగిందని, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌కు సంబంధించి 2 దరఖాస్తులు అనుమతి కొరకు పరిశీలనలో ఉన్నాయన్నారు.

విద్యుత్‌ శాఖకు సంబంధించి 1 దరఖాస్తుకుగాను అనుమతుల ప్రక్రియ ప్రగతిలో ఉందన్నారు. ఫ్యాక్టరీలకు సంబంధించి 2 దరఖాస్తులకుగాను 1 దరఖాస్తుకు అనుమతి ఇవ్వగా, 1 దరఖాస్తు పరిశీలనలో ఉన్నాయన్నారు.

పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి 2 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని కలెక్టర్‌ తెలిపారు.

పరిశీలన ప్రక్రియలో దరఖాస్తులు తిరస్కరించక, దరఖాస్తుదారునితో ఆయా అనుమతికి కావాల్సినవి సమర్పణకు వారికి సహకరించాలని కలెక్టర్‌ అన్నారు.

Related posts

పోక్సో చట్టం కింద నిందితుడి కి 20 ఏళ్ల జైలు శిక్ష…!

Satyam NEWS

భగత్ సింగ్ ఆశయ సాధనకు యువత ఉద్యమించాలి

Bhavani

50 లక్షలతో పట్టుబడ్డోడు నాపై పోటీ చేస్తాడట

Satyam NEWS

Leave a Comment