28.7 C
Hyderabad
April 26, 2024 09: 54 AM
Slider ఆధ్యాత్మికం

శ్రీ సౌమ్యనాధ స్వామి ఆలయం టీటీడీ స్వాధీనంకు రంగం సిద్ధం…

#sowmyanathaswamy temple

కడప జిల్లా నందలూరు లోని చారిత్రక నేపథ్యం కలిగిన చోళ రాజుల కాలంలో నిర్మితమైన శ్రీ సౌమ్యనాధ దేవాలయం టీటీడీ స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధం అయ్యింది.

ఈ మేరకు ఇటీవల తిరుమల లో జరిగిన నూతన పాలకమండలి తొలి సమావేశంలో టీటీడీ చెర్మెన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన ఇందుకు సంబంధించి అంగీకారాన్ని ఆమోదించినట్టు తెలిసింది.స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి టీటీడీ బోర్డు సభ్యులుగా ఉన్నప్పుడు నందలూరు శ్రీ సౌమ్యనాధ దేవాలయంను టీటీడీ స్వాధీనం చేసుకోవాలని వ్రాత పూర్వకంగా కోరి ఉన్నారు.

అది పరిశీలిన దశలో ఉన్న నేపధ్యంలో టీటీడీ పాలక మండలి గడువు ముగిసి తిరిగి పునర్నియామాకం జరిగింది.ఈ సందర్భంగా జరిగిన తోలి సమావేశంలో ఇందుకు సంబంధించిన అంశం చర్చకు వచ్చి అంగీకారాన్ని ఆమోదించి జీవో సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.

జులై 7వతేది నాటికి శ్రీ సౌమ్యనాధ ఆలయం పాలక మండలి గడువు ముగిసింది. ఈనేపధ్యంలో గతనెల రెండో వారంలో జరిగిన బ్రహ్మోత్సవాలు స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి కుటుంబీకుల సారధ్యంలో ఘనంగా నిర్వహించారు. టీటీడీ పరమైతే ఆలయంలో నిత్య కైంకర్యాలు ధూప దీప నైవేద్యాలు ఆలయ అర్చకుల,సిబ్బంది జీత భత్యాలు ఆలయ ఉత్సవాల నిర్వహణ మొత్తం టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

ఇందులో స్థానిక స్థానికుల ప్రమేయం ఉండదు.దీనితో దేవుని పేరు చెప్పుకుని భుక్తి జరుపుకుంటున్న వారు నిరాశ చెందుతున్నారు. టీటీడీ వారు ఎవరు ఉన్నా లేకున్నా, వచ్చినా రాకున్నా,వారి పని వారు చేసుకొని చక్కగా వెళ్లి పోతారని,దీని వలన తమ మనుగడ ప్రశ్నార్థకం అని వాపోతున్నారు. ఇప్పటికే కడప జిల్లాలో ఒంటిమిట్ట, తాళ్ళపాక, దేవుని కడప,జమ్మలమడుగు ఆలయాల టీటీడీ నిర్వహణలో నడుస్తున్నాయి.

Related posts

నవ సమాజ నిర్మాత మహాత్మ జ్యోతిరావు పూలే!

Bhavani

స్వచ్ఛ భారత్: ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలి

Satyam NEWS

ఫైర్ బ్రాండ్ రోజాకు సొంతింట్లోనే కుంపటి

Satyam NEWS

Leave a Comment