28.7 C
Hyderabad
April 27, 2024 06: 13 AM
Slider గుంటూరు

మహిళలు స్నానాలు చేసేటప్పుడు వీడియో తీయలేదు

Tulluru police

మహిళలు స్నానాలు చేసేటప్పుడు డ్రోన్ ద్వారా పోలీసులు వీడియోలు తీసారనేది అవాస్తవమని తుళ్ళూరు డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బూటు కాలితో తన్నినట్లు నాపై కూడా కొన్ని వార్తలు రాశారు…నేనెవరిని తన్నలేదు, నా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి అని ఆయన అన్నారు. జేఏసీ కన్వీనర్ శ్రీనివాస్ ని కులం పేరుతో ఎవరూ దూషించలేదు..కేవలం కల్పితం మాత్రమే.

కులం పేరుతో దూషించడం లాంటివి మేము చెయ్యము అని ఆయన అన్నారు. మందడంలో రైతులను లీడ్ చేస్తున్న జేఏసీ సభ్యుడు పువ్వాడ సుధాకర్ ఈ అలజడికి కారణమని ఆయన తెలిపారు. హైసెక్యూరిటీ జోన్ కావడంతో మా డిపార్ట్మెంట్ డ్రోన్ ఉపయోగించిందని, తాను ఆదేశాలు ఇవ్వడంతో కానిస్టేబుల్  డ్రోన్  వాడాడని ఆయన తెలిపారు. అక్కడ అలజడి పరిస్థితి ఉండడంతో డ్రోన్ ఆపమని చెప్పానని డిఎస్పి అన్నారు. నిన్న మందడంలో సచివాలయం వెళ్లే వాహనాలు అడ్డుకున్నారు, క్రిష్ణాయపాలెం ఘటనపై నమోదైన కేసులు వెత్తివేయ్యాలని రైతులు రోడ్డుపై బైటాయించారు ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగే సమయంలో మాత్రమే డ్రోన్ వాడుతాం అని ఆయన చెప్పారు.

Related posts

కరోనా హెల్ప్: దత్తత గ్రామంలో నిత్యావసరాలు పంచిన సీపీ

Satyam NEWS

చేతులకు తాళ్లు కట్టుకుని నారా భువనేశ్వరి నిరసన

Satyam NEWS

ఎకరాకు 10వేలు

Murali Krishna

Leave a Comment