40.2 C
Hyderabad
April 28, 2024 16: 43 PM
Slider ప్రపంచం

టర్కీ డిజాస్టర్:టర్కీలో భారీభూకంపం18మంది మృతి

turkey earth quake 18 dead

టర్కీ దేశంలో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 18 మంది మరణించగా, 550 మందికి పైగా గాయపడ్డారు. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.8 గా నమోదుకాగా ఈ ప్రాంతం లో 56 సార్లు భూమి కంపించిందని టర్కీ డిజాస్టర్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అధికారులు తెలిపారు.తర్కీకి తూర్పున ఉన్న ఇలాజిజ్‌ ఫ్రావిన్స్‌లోని సివ్‌రిస్‌ జిల్లాలో భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి భూమి కంపించడం తో ప్రజలు భయం తో రోడ్ల పైకి పరుగు తీశారు.

అలాగే గాజియన్టెప్ నగరానికి తూర్పున 218 కి.మీ దూరంలో 15 కి.మీ లోతులో భూకంపం ఏర్పడిందని యూరోపియన్ మెడిటెరాన్ సిస్మాలాజికల్ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదైంది. పొరుగు దేశాలైన సిరియా, లెబనాన్‌లోనూ భూప్రకంపనలు సంభవించాయి. కూలిన భవనాలలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు 400 మంది సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

Related posts

మాలలకు ద్రోహం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ

Satyam NEWS

కేజీబీవీలో మెరిసిన ఆణిముత్యాలు: సత్తాచాటిన అనాధ బాలికలు

Satyam NEWS

బ్యాంకును ముట్టడించిన వైసీపీ నాయకులు

Satyam NEWS

Leave a Comment