37.2 C
Hyderabad
April 26, 2024 20: 29 PM
Slider సినిమా

కరోనా హెల్ప్: టీవీ, సినీ కళాకారులు అధైర్యపడొద్దు

Cine Artists

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉన్నందున షూటింగ్ లేక ఉపాధి కోల్పోతున్న తెలంగాణ సినీ & టి.వి. మేకప్ & హెయిర్ స్టయిలిస్ట్ యూనియన్ సభ్యులు అధైర్య పడవద్దని యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు.

నేడు యూనియన్ నాయకులు ప్రతి సభ్యునికి 2 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న దృష్ట్యా అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని సోషల్ డిస్టెన్స్ పాటించి చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. యూనియన్ సభ్యులు అందరూ మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండాలన్నారు. సినీ కార్మికుల జీవితాలు రోజువారీగా పనిచేస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి.

అలాంటిది ఈ కరోనా మహమ్మారి వచ్చి లాక్ డౌన్ తీసుకొచ్చిందని, ఇలాంటి పరిస్థితుల్లో యూనియన్ సభ్యులు ఎవ్వరు ఇబ్బందులు పడొద్దని, యూనియన్ పెద్దలు అందరికి అండగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రఘు, జనరల్ సెక్రెటరీ, కేశవ్, కోశాధికారి స్వామి, వైస్ ప్రసిడెంట్ రవి, రామచంద్రుడు, జాయింట్ సెక్రటరీ సాగర్  కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు.

Related posts

ముత్యపుపందిరివాహనంపై ఆదిలక్ష్మి దేవి అలంకారంలోఅలమేలుమంగ

Satyam NEWS

ప్రతిభ కనబర్చిన విజయనగరం పోలీసులకు ప్రశంసా పత్రాలు

Satyam NEWS

మహిళా దినోత్సవం రోజున పింక్ మార్ థాన్ పరుగు

Satyam NEWS

Leave a Comment