40.2 C
Hyderabad
April 29, 2024 15: 22 PM
Slider నిజామాబాద్

అగ్లీ ఫెలో: ఆరు నెలలుగా కూతురిపై అత్యాచారం

ugly fellow

బయటి వాళ్ళ చూపు కూతురిపై పడకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి కామంతో కూతురిపై కన్నేశాడు. కూతురుని ఎలాగైనా అనుభవించాలని పథకం పన్నాడు. బెదిరించి లోబరుచుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి రెండు నెలల గర్భిణీ. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేట్ గ్రామంలో వెలుగు చూసింది.

పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఇసాయిపేట్ గ్రామానికి చెందిన పిట్ల నర్సింలుకు 19 సంవత్సరాల కూతురు, 16 సంవత్సరాల కుమారుడు ఉన్నారు. కూతురు 10 వ తరగతి పూర్తి చేసి గత మూడు సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉంటుంది. కుమారుడు రంజిత్ చదువు మానేసి ఓ చోట జీతం చేస్తున్నాడు.

భార్య రేణుక కూలికి వెళ్తూ బీడీలు చుడుతుంది. 15 సంవత్సరాల క్రితం దుబాయి వెళ్లి వచ్చిన నర్సింలు కామారెడ్డిలో అడ్డ కూలీగా పని చేస్తున్నాడు. ఓ రోజు కూతురును అర్ధనగ్నంగా చూసిన నర్సింలు ఎలాగైనా కూతురును అనుభవించాలని పథకం పన్నాడు. ఇంట్లో అందరూ పడుకున్నాక తండ్రి ముసుగులో ఉన్న కామాందుడు బయటికి వచ్చి కూతురిపై పడ్డాడు.

భార్య, కొడుకులకు కల్లు తాగించి వాళ్ళు నిద్రలోకి జారుకోగానే కూతురిపై పడేవాడు. ఎవరికైనా చెప్తే తల్లిని, తమ్ముడిని చంపేస్తానని బెదిరించేవాడు. గత్యంతరం లేక అమ్మాయి తండ్రి కామానికి బలైపోయేది. అయితే గత రెండు రోజుల క్రితం నెలసరి సరిగా రావడం లేదని తల్లితో కలిసి ఏఎన్ఎం వద్దకు వెళ్లి పరీక్షలు చేయగా నెలన్నర గర్భిణిగా గుర్తించారు.

 గతంలో ఇలాగే కూతురిపై చేశాడని భార్య రేణుక తల్లిగారింటికి వెళ్ళిపోతే తాగిన మైకంలో చేసానని, మరోసారి ఇలా జరగదని పంచాయతీ పెద్దల ముందు ఒప్పుకుని భార్యాపిల్లలను ఇంటికి తెచ్చుకున్నాడు. మళ్ళీ అనుమానం వచ్చిన బ్యార్య రేణుక భర్తను నిలదీయగా నిజం ఒప్పుకున్నాడు. వెంటనే కూతురిని తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి భర్త చేసిన ఘనకార్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గ్రామానికి వచ్చి విచారణ జరిపిన అనంతరం నర్సింలును అరెస్ట్ చేసి మంగళవారం రాత్రి కోర్టులో జడ్జి ముందు హాజరిపరచగా అతనికి రిమాండ్ విధించింది కోర్టు. అయితే ఇలాంటి క్రూర మృగాన్ని జైలులో ఉంచకుండా చంపేయాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతను మంత్రాలు చేసే వాడని, అతని ఇంటివైపు వెళ్ళడానికి భయపడేవారమని గ్రామస్తులు తెలిపారు. కన్న కూతురిపై ఇంతటి ఘోరనికి పాల్పడిన ఘటన గ్రామంలో అలజడి సృష్టించింది.

Related posts

పరిపాలనలో పారదర్శకత పెంచేందుకే కంట్రోల్ రూమ్

Satyam NEWS

విజయనగరం డిప్యూటీ మేయ‌ర్ ముచ్చు నాగలక్ష్మి కరోనాతో మృతి

Satyam NEWS

సెలబ్రేషన్: వాలీబాల్ ఛాంపియన్ షిప్ క్యాంప్ ఫైర్

Satyam NEWS

Leave a Comment