28.7 C
Hyderabad
April 28, 2024 09: 22 AM
Slider ప్రపంచం

UN Report: భారత్ లో గణనీయంగా తగ్గిన పేదరికం

#unitednations

దేశంలో పేదరికం గణనీయంగా తగ్గింది. ఈ అంశాన్ని వేరే ఎవరో కాదు సాక్షాత్తూ ఐక్యరాజ్య సమితి ధృవీకరించింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) మరియు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆక్స్‌ఫర్డ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్ (OPHI) సోమవారం విడుదల చేసిన కొత్త మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (MPI) లో భారత దేశంలో పేదరికం గణనీయంగా తగ్గినట్లు వెల్లడయింది.

2005-06 నుండి 2019-21 మధ్య కాలంలో భారతదేశంలో పేదల సంఖ్య దాదాపు 415 మిలియన్లు తగ్గింది. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం ఇది చారిత్రాత్మక మార్పు. సుస్థిర అభివృద్ధి కింద అన్ని వయసుల పురుషులు, మహిళలు మరియు పిల్లల్లో 2030 నాటికి పేదరికాన్ని సగానికి తగ్గించాలనే లక్ష్యాన్ని కూడా భారత్ సాధించే వీలువుందని కూడా నివేదిక పేర్కొన్నది.

15 సంవత్సరాలలో భారతదేశంలోని 415 మిలియన్ల మంది పేదరికం నుండి బయటపడటం ఒక చారిత్రాత్మక మార్పు అని ఐక్యరాజ్యసమితి పేర్కొన్నది. భారతదేశంలో ఈ మార్పు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం ఒక ముఖ్యమైన కేస్ స్టడీ అని UN పేర్కొంది.

పేదరికాన్ని అన్ని రకాలుగా అంతం చేయడం, 2030 నాటికి అన్ని కోణాల్లో పేదరికంలో మగ్గుతున్న అన్ని వయసుల పురుషులు, మహిళలు మరియు పిల్లల నిష్పత్తిని తగ్గించడం భారత్ లో సాధ్యమైందని నివేదిక పేర్కొన్నది. 2020 జనాభా లెక్కల ప్రకారం భారత్ ప్రపంచంలోనే అత్యంత పేద దేశమని నివేదిక పేర్కొంది. ఇక్కడ పేదల సంఖ్య 228.9 మిలియన్లు (22.89 కోట్లు).

దాని తర్వాత నైజీరియాలో 96.7 మిలియన్లు (9.67 కోట్లు) పేదలు ఉన్నారు. పేదరికం నిర్మూలనలో పురోగతి ఉన్నప్పటికీ, కోవిడ్-19 మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు, పెరుగుతున్న ఆహారం కొరత, పెరుగుతున్న ఇంధన ధరల వల్ల భారతదేశ జనాభా ప్రభావితమౌతున్నది. పోషకాహార లోపం వంటి సవాళ్లను ఎదుర్కోవాలంటే సమీకృత విధానాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నివేదిక పేర్కొంది.

గణాంకాలు మెరుగుపడినప్పటికీ, 2019-21లో భారతదేశంలో 97 మిలియన్ల మంది పేద పిల్లలు ఉన్నారని నివేదిక పేర్కొంది. ఇది గ్లోబల్ MPI పరిధిలోకి వచ్చిన ఇతర దేశంలోని పేదలు, పిల్లలు మరియు పెద్దలు మొత్తం సంఖ్య కంటే ఎక్కువ. సమీకృత అభివృద్ధి విధానాలు ఎంతో మంది జీవితాలను మెరుగుపరుస్తాయని మల్టీడిసిప్లినరీ పాలసీ విధానాలు భారత్ లో నిరూపింస్తున్నాయని ఐక్యరాజ్యసమితి పేర్కొన్నది.

111 దేశాల్లోని 1.2 బిలియన్ల జనాభాలో 19.1 శాతం మంది తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారని నివేదిక పేర్కొంది. వీరిలో 593 మిలియన్ల జనాభాలో సగం మంది (59 కోట్లకు పైగా) 18 ఏళ్లలోపు పిల్లలు.

Related posts

ఆకస్మికంగా వార్డు సచివాలయం తనిఖీ చేసిన అన్నమయ్య జిల్లా కలెక్టర్

Satyam NEWS

మున్నూరుకాపులకు ప్రత్యేక కార్పొరేషన్స్ ఏర్పాటు చేయాలి

Satyam NEWS

భట్టి నాయకత్వంలో పటిష్టంగా ముందుకు వెళుతున్న కాంగ్రెస్

Satyam NEWS

Leave a Comment