బిచ్కుంద మండల కేంద్రంలో జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన డిపిఎల్ కంపెనీ ప్రాంగణంలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు అక్కడ వెదజల్లే దుర్గంధం స్పష్టం చేస్తున్నది.
మృతుడి ఘటన తెలియడంతో బిచ్కుంద ఎస్సై కృష్ణ ఘటనాస్థలం చేరుకోగా విలేఖరులు న్యూస్ కవరేజ్ చేయడానికి వెళుతుండగా డిబీఎల్ యాజమాన్యం అడ్డుకున్నది. ఇప్పటికే అనేక మార్లు ఆ కంపెనీలో గొడవలు దాడులు జరిగినట్లు సమాచారం ఉంది కానీ విలేకరులను మాత్రం అక్కడ రానివ్వడం లేదు.
అయినప్పటికీ బిచుకుంద విలేకరులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం తీరును పరిశీలించారు. మృతుడు యాభై నుండి అరవై ఏళ్ల మధ్య వయసు కూడా ఉన్నాడు. ఆయన పడిన నీటి గుంత స్టోరేజ్ నీటి కోసం తవ్వింది ఉంది. అక్కడికి వెళ్లిన రెండు గంటల తర్వాత యాజమాన్యం స్పందించి క్రేన్ సహాయంతో మృతదేహాన్ని బయటికి తీయడం విశేషం.
ఈ విషయం పట్ల తహశీల్దార్ ఎస్సైలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని గుర్తుపట్టేలా ఎవరూ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అక్కడ కంపెనీ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా మారింది.