29.7 C
Hyderabad
April 29, 2024 09: 36 AM
Slider మహబూబ్ నగర్

ఉద్యోగ ఉపాధి కల్పనలో మోదీ ప్రభుత్వం విఫలం

#kagitivijayakumarreddy

ఉద్యోగ, ఉపాధి కల్పనలో మోడీ ప్రభుత్వం విఫలమైందని కాయితి విజయకుమార్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పార్లమెంట్లోకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఐదో బడ్జెట్ తీవ్ర నిరాశపరిచిందని కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితి విజయ్ కుమార్ రెడ్డిఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ45 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, పార్లమెంటు వేదికగా విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ, ఏదైనా సాగు నీటీ ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి అంశాలను బడ్జెట్లో విస్మరించారన్నారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐటీఆర్ ప్రాజెక్ట్ ప్రస్తావన లేదని,2019 ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారని, 2014 ఎన్నికల సందర్భంగా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చిన మాటను తుంగలో తొక్కారని విమర్శించారు. ఇందులో ఏ ఒక్క హామీని నేరవేర్చలేదని దుయ్యబట్టారు. ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు లెక్కన ఈ 9 ఏళ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా అందులో తెలంగాణ రాష్ట్రానికి 75 లక్షల ఉద్యోగాలు దక్కాల్సి ఉందని గత పార్లమెంటు సమావేశాల్లో నేను అడిగిన ప్రశ్నకు వివిధ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల నుంచి 22 కోట్ల దరఖాస్తులు వస్తే 7 లక్షలు ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొందని దీన్ని బట్టి ఉద్యోగ, ఉపాధి కల్పనలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు.

రైతుల ఆదాయం సంగతి ఏమోగానీ పెట్టుబడి మాత్రం రెండింతలైందని విమర్శించారు. దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి దాపురించిందని, 2014 ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ పర్యటనలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రస్తావించారని కానీ నేటి వరకు ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని, అన్ని రకాలుగా కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపించిందని,ఎన్నికలు జరుగుతున్న కర్ణాటక రాష్ట్రానికి మాత్రం నిధులు భారీగా కేటాయించిందని అసహనం వ్యక్తం చేశారు.

కాగ తీవ్రమైన వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తెలంగాణ పట్ల మాత్రం కేంద్రం వివక్ష చూపిందని, కరోనా కాలంలో అదుకున్న ఉపాధి హామీ పథకానికి నిధులను పనిదినాలను కేంద్రం తగ్గించిందని, పేదల పట్ల ఈప్రభుత్వానికి ఎలాంటి ప్రేమ, దయ, పట్టింపు లేదన్నారు. ఏరకంగా చూసినా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.

Related posts

పాకిస్తాన్ లో సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు షురూ

Satyam NEWS

సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రిలో 40 కిలోవాట్ సోలార్ ప్లాంట్

Bhavani

అక్టోబర్ 21న ఫ్లాగ్ డే

Murali Krishna

Leave a Comment