40.2 C
Hyderabad
April 29, 2024 17: 52 PM
Slider చిత్తూరు

శ్రీవాణి ట్రస్ట్ నిధులపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు

#Tirumala

తిరుపతి వార్త అనే పత్రిక పేరును ఉపయోగించుకుని మాచర్ల శీను అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల ద్వారా టీటీడీ వారి శ్రీవాణి ట్రస్ట్ విరాళాలకు సంబంధించిన కార్పస్ మరియు జనరల్ డొనేషన్ అకౌంట్ల ను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దుష్ప్రచారానికి సంబంధించిన వాస్తవాలపై టీటీడీ వివరణ ఇచ్చింది. వివరాలు: శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించి భక్తులు రెండు విధాలుగా రెండు వేరు ఖాతాల్లోకి జమ చేస్తారు. ఒకటి కార్పస్ డొనేషన్ ఖాతా రెండు జనరల్ డొనేషన్ ఖాతా. కార్పస్ డొనేషన్ ఖాతాలో దాత ఇచ్చిన విరాళాన్ని ఫిక్స్డ్ డిపాజిట్/ఇన్వెస్ట్మెంట్ చేసి దాని ద్వారా వచ్చిన వడ్డీతో శ్రీవాణి ట్రస్ట్ లక్ష్యాలు ఏదైతే ఆలయాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు మరియు నిర్వహణ కార్యక్రమాలకు అయ్యే ఖర్చులకు దానికి ఉపయోగిస్తారు. ఇది దీర్ఘకాలిక ప్రయోజనం కోసం దాత ఇచ్చే విరాళం.

శ్రీవాణి ట్రస్ట్ కు అవసరాన్ని బట్టి స్వల్పకాలికంగా ట్రస్ట్ లక్ష్యం ప్రకారం వెంటనే ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు లాంటివి చేయడం కోసం జనరల్ డొనేషన్స్ కూడా తీసుకోవడం ద్వారా ట్రస్ట్ యొక్క లక్ష్యాలు మరియు నిర్వహణ కోసం నేరుగా ఉపయోగించవచ్చు. జనరల్ డొనేషన్ అంటే వడ్డీతో పని లేకుండా దాత ఇచ్చిన విరాళాన్ని శ్రీవాణి ట్రస్ట్ లక్ష్యాలకు మరియు నిర్వహణకు ఖర్చుల బట్టి నేరుగా వాడుకోవచ్చు.

అదే కార్పస్ డొనేషన్ ఖాతాలో జమ అయిన విరాళాన్ని ఫిక్స్ డిపాజిట్/ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా వచ్చిన వడ్డీని మాత్రమే ట్రస్ట్ లక్ష్యాలకు మరియు నిర్వహణకు ఉపయోగిస్తారు. ఏదైతే జనరల్ డొనేషన్ ఉందో దానిని శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించిన జనరల్ డొనేషన్ అకౌంట్ లో జమ చేయబడుతుంది తప్ప టిటిడి జనరల్ అకౌంట్ లో జమ చేయబడదు. ఇది గుర్తుంచుకోవాలి.

కార్పస్ డొనేషన్ ఖాతా ఫిక్స్ డిపాజిట్లు/ఇన్వెస్ట్మెంట్ల ద్వారా వచ్చే వడ్డీలతో రోజువారి ట్రస్ట్ లక్ష్యాలు మరియు నిర్వహణ ఖర్చులకు ఉపయోగించడం సాధ్యం కాదు కాబట్టి జనరల్ డొనేషన్ ఖాతా ద్వారా రోజువారి లక్ష్యాలు మరియు నిర్వహణకు నేరుగా ఉపయోగించుకునే విధంగా ప్రతి ట్రస్టు రెండు ఖాతాలు వినియోగించుకుంటాయి. టీటీడీలో నిర్వహించే ప్రాణదానం, అన్నదానం ట్రస్ట్లే కాకుండా మిగతా అన్ని ట్రస్టులు కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తాయి. ఈ పద్ధతి టిటిడిలోనే కాదు బయట నడపబడే ప్రైవేట్ ట్రస్టులు అన్నీ కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తాయి.

శ్రీవాణి ట్రస్ట్ అనేది భారత ఆదాయపుశాఖ కమిషనర్ గుర్తించిన ఇన్కమ్ టాక్స్ అసెస్మెంట్ అయినా ట్రస్ట్ ఇది. అంతేకాక శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించిన ప్రతి ఖాతాను ఆదాయ పన్ను వారికి తెలియపరుస్తారు. అదేవిధంగా ఆదాయపన్ను వారు ఈ మధ్యనే శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించిన ఖాతాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి పరిపూర్ణంగా ఉన్నట్లు ధృవీకరించారు. దాత కోరిక మేరకే విరాళాన్ని కార్పస్ లేదా జనరల్ డొనేషన్లుగా పరిగణించబడుతుంది.

ఇవన్నీ తెలుసుకోకుండా తమ స్వార్థ ప్రయోజనాల కోసం టీటీడీ ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకుని మాచర్ల శీను అనే వ్యక్తి దుష్ప్రచారం చేయడం అమానుషం. సక్రమంగా నడిచే శ్రీ వాణి ట్రస్టును వక్ర బుద్ధితో నిర్వీర్యం చేయాలని చూస్తున్నాడు ఈ మాచర్ల శీను. ఇలాంటి వ్యక్తులు చేసే దుష్ప్రచారాలను శ్రీవారి భక్తులు, మీడియా మిత్రులు ఎవరు కూడా నమ్మకండి. టీటీడీ జనరల్ అకౌంట్ మరియు శ్రీవాణి జనరల్ డొనేషన్ అకౌంటు రెండు వేరు వేరు ఖాతాలు. రెండింటికి ఏ సంబంధం లేదు అని వివరణ ఇచ్చారు.

Related posts

జగన్ సర్కార్ కు హైకోర్ట్ లో మరోసారి చేదు అనుభవం

Satyam NEWS

బ్రాహ్మణులకు జరుగుతున్న అన్యాయాలపై 19 న కార్పొరేషన్ ముట్టడి

Satyam NEWS

బతుకు పాఠం

Satyam NEWS

Leave a Comment