28.7 C
Hyderabad
April 28, 2024 08: 02 AM
Slider నల్గొండ

విద్యార్ధులకు నూతన సాంకేతిక పద్దతులలో విద్యా బోధన చేయాలి

#MLASaidireddy

విద్యార్ధి దశలోనే నూతన సాంకేతికతను అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు ఉంటాయని శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్ నందు ఆదివారం నిర్వహించిన తెలంగాణ గురుకుల పాఠశాల,కాలేజీల ఆధ్వర్యంలో జరిగిన యురేకా – 2020 కార్యక్రమంలో పాల్గొన్న సైదిరెడ్డి మాట్లాడుతూ  ఉపాధ్యాయులు నూతన సాకేతిక పద్దతులలో బోధన చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా విద్యార్ధులు తయారు చేసిన వివిధ రకాల కళాకృతులను పరిశీలించి అభినందించారు.   ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, ఎం‌పి‌పి గుడెపు శ్రీనివాస్,

పట్టణ పార్టీ అధ్యక్షుడు చిట్యాల అమరనాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, ముడెం గోపిరెడ్డి, కళాశాల  ప్రిన్సిపల్ CH.వాణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమృతం కన్నా మధురం

Satyam NEWS

సంక్షేమ పథకాలు అర్హులందరికి అందేలా చొరవ

Satyam NEWS

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment