38.2 C
Hyderabad
April 29, 2024 19: 49 PM
Slider జాతీయం

సొంత నేతలపై సీనియర్ నేత వ్యాఖ్యలు

వచ్చే ఏడాది ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. పార్టీ పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ , రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ సోషల్ మీడియా ద్వారా రిలాక్స్ అయ్యే సమయం వచ్చిందంటూ వ్యాఖ్యలు చేశారు.

ఈ ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి.ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సారథి, మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ తన సొంత పార్టీ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడం సంచలనంగా మారింది.

ఉత్తరాఖండ్‌లోని పార్టీ నాయకత్వంలో తన మాటలకు తగిన శ్రద్ధ లభించడం లేదని హరీష్ రావత్ ట్వీట్ చేశారు. ‘ఎన్నికల సముద్రం అల్లకల్లోలం కావడం వింత కాదు, తన పార్టీ వాళ్లు తనను అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తాను ఈదాలనుకున్న ఎన్నికల సముద్రంలో అధికారం మొసళ్లను వదిలేసిందని, సొంత వాళ్లే వెనుదిరగడం, ప్రతికూల పాత్ర పోషిస్తోంది’ అని రావత్ ట్వీట్ చేశారు.

Related posts

కాలువ నిర్మాణంపై కాంగ్రెస్ ఆందోళ‌న‌

Sub Editor

మూసీ నదిలో మహిళ మృతదేహం లభ్యం

Satyam NEWS

మంథని అడవుల్లో ఆరు పెద్ద పులులు

Satyam NEWS

Leave a Comment