విశ్వ హిందూ మహాసభ అధ్యక్షుడు రంజీత్ బచ్చన్ హంతకుల అనుమానిత సిసిటివి ఫుటేజీని ఉత్తర ప్రదేశ్ పోలీసులు విడుదల చేశారు.నిన్న లక్నోలోని హజ్రత్‌గంజ్ ప్రాంతంలో రంజీత్ బచ్చన్ కాల్చి చంపబడిన విషయం తెలిసిందే.నిందితుడి గురించి సమాచారం అందించిన వారికి రూ .50 వేల రివార్డును కూడా పోలీసులు ప్రకటించారు.ఆదివారం హజ్రత్‌గంజ్ ప్రాంతంలో మార్నింగ్ వాక్ చేస్తున్న బచ్చన్ ను బైక్ ఫై వచ్చిన దుండగులు కాల్చి చంపారని సెంట్రల్ లక్నో డిసిపి దినేష్ సింగ్ చెప్పారు.దీనిపై కేసు నమోదు చేసి ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు..
previous post