40.2 C
Hyderabad
April 29, 2024 17: 31 PM
Slider నల్గొండ

కార్మిక కార్యాలయాలలో అధికారులను తక్షణమే నియమించాలి

#silpakala

నూతనంగా నిర్మించిన శిల్పకళ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో ఆ సంఘ కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శిల్పకళ బిల్డింగ్ వర్కర్స్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో రెండు కార్మిక కార్యాలయాలు ఉన్న అధికారులు నామమాత్రంగా ఉండడంతో భవన నిర్మాణ కార్మికులు కొత్తగా వెల్ఫేర్ బోర్డులో సభ్యత్వం పొందాలన్నా, బోర్డు నుండి ఏదైనా భీమా పొందాలన్న, సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి జిల్లాలో ఉందని అన్నారు.కార్మికుల సంక్షేమం కోసం బోర్డులో కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ అధికారులను నియమించడంలో,కార్మికులకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వడంలో, రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని,తక్షణమే కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి,పెండింగ్ క్లైమ్ లను మంజూరు చేసి సమస్యల పరిష్కారిచాలని కోరారు.ఇట్టి విషయమై ఈ నెల 26న, జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నట్టు సోమయ్య గౌడ్ విలేకరులకు తెలియజేశారు.

జిల్లాలోని 23 మండలాల నుండి భవన, ఇతర నిర్మాణ కార్మికులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ధర్నాను జయప్రదం చేయాల్సిందిగా కార్మికులను కోరారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఉప్పల గోవింద్,మండల కోశాధికారి శీలం వేణు,పట్టణ అధ్యక్షుడు ఉప్పతల వెంకన్న, ఉపాధ్యక్షుడు పల్లపు రామకృష్ణ,కోశాధికారి నరేష్,వేముల బాల కోటయ్య,చల్ల నాగరాజు,గండు శివ,గండు నాగరాజు,వేముల చిన్న రాజు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

Satyam NEWS

ఎస్సైగా కొడుకు.. అంతులేని ఆనందంలో పేరెంట్స్

Satyam NEWS

త్వరత్వరగా వచ్చేస్తున్న ఈశాన్య రుతుపవనాలు

Satyam NEWS

Leave a Comment