40.2 C
Hyderabad
April 26, 2024 12: 47 PM
Slider విజయనగరం

రాజన్న రాజ్యంలో పస్తులుంటున్న మున్సిపల్ కార్మికులు

#protest

రాజన్నా మున్సిపల్ కార్మికులకి న్యాయం చేసే జ్ఞానాన్ని మీ జగన్ బిడ్డకి ప్రసాదించండి

మున్సిప‌ల్  కార్మికుల‌లు నాలుగురోజులుగా   ఉద్యమం చేస్తున్నా కనీసం స్పందించకుండా ఉన్న రాజన్న బిడ్డ జగన్మోహన్ రెడ్డికి   ఙ్ఞానాన్ని ప్రసాదించండి అని  ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ వేడుకున్నారు. మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులు, డ్రైవర్లు ఏ.పి.మున్సిపల్ వర్కర్స్ ఏఐటీయూసీ అనుబంధ యూనియన్ ఆధ్వర్యంలో 4వ రోజు రాష్ట్ర వ్యాప్త సమ్మె లో భాగంగా గురువారం విజయనగరం జిల్లా కేంద్రంలో సి.ఎమ్.ఆర్ దగ్గర ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి వినతిపత్రం అందచేశారు.

అనంతరం మున్సిపల్ కార్మికులు ఉద్యమానికి ప్రజల నుంచి మద్దత్తు కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం అక్కడ నుంచి భారీ ఎత్తున కన్యకాపరమేశ్వరీ ఆలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్. రంగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పట్ల ముఖ్యమంత్రి జగ్మోహన్ రెడ్డికి నిర్లక్ష్యం తగదని అన్నారు.

11వ పీఆర్సీ ప్రకారం పెరిగిన వేతనాలు అమలు చేయడం లేదన్నారు, సీఎం  వాగ్దానం మేరకు అమలు చేస్తున్న హెల్త్ అలవెన్సు 6 నెలలు తరబడి దాన్ని అమలు చేయకుండా బకాయి పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. మున్సిపల్ కార్మికులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని ప్రభుత్వం ఇచ్చిన జీఓల ప్రకారం స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికులకు అమలు చేయాల్సిన వేతనాలు అమలు కానందున కార్మికులు తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెలోకి రావాల్సిన పరిస్థితి ప్రభుత్వమే తీసుకోచిందన్నారు.

మీరు చెప్పే మాయమాటలకి మరోసారి మోసపోవడానికి కార్మికులు సిద్ధంగా లేరన్నారు. కార్మికుల రక్షణ పరికరాలు వంటి కనీస సమస్యలను కూడా పరిష్కరించడం లేదని గత 3 ఏళ్లల్లో ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు వారి పిల్లలకి, మరణించిన కార్మికుల పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వకపోవడం చాలా దారుణం ఆగ్రహం వ్యక్తంచేశారు.

పట్టణ విస్తరణ పెరుగడం వలన పనిభారం తీవ్రంగా పెరుగుతుందని అందుకే కార్మికుల సంఖ్యను పెంచండని ఎన్నిసార్లు అడిగినా తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తూ కార్మికుల సంఖ్య పెంచడం లేదని మండిపడ్డారు. మున్సిపల్ కార్మికులు చేస్తున్న డిమాండ్స్ ప్రభుత్వం పరిష్కరించలేని డిమాండ్స్ మాత్రం కాదు కానీ కమిటీల పేరుతో తాత్సారం చేస్తున్నారని విమర్శించారు.

మున్సిపల్ రంగంలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులు, వాహన డ్రైవర్లకి హెల్త్ అలవెన్స్ ఇవ్వాల్సిందేనని అన్నారు, ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్మి అప్పలరాజు దొర, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జలగడుగుల కామేష్, ఏ.ఐ.ఎస్.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. నాగభూషణం, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సంతోష్, తుపాకుల శ్రీను, కళ్యాణ్ శ్రీను, దలాయ్ శ్రీను, కోడూరు. చిరంజీవి, జె. భాస్కరరావు, డి.సత్తిబాబు, కిషోర్ మరియు మహిళా కార్మికులు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

భారత విప్లవ కెరటం భగత్ సింగ్ పుస్తకావిష్కరణ

Satyam NEWS

ఫారెస్టు డిస్ట్రాక్షన్: ఇక్కడ మొక్కల రక్షణ అక్కడ అడవుల భక్షణ

Satyam NEWS

ఆణిముత్యాలకు 46 లక్షల 28వేల నగదు బహుమతులు…!

Satyam NEWS

Leave a Comment