26.7 C
Hyderabad
April 27, 2024 10: 39 AM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ న్యాయమూర్తుల సంఖ్య ను పెంచడం హర్షణీయం

#kishanreddy

తెలంగాణ న్యాయ వ్యవస్థ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు.

కేంద్ర న్యాయ శాఖ మంత్రి  రవిశంకర్ ప్రసాద్, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తో సంప్రదించి, తెలంగాణ హైకోర్టులో  న్యాయమూర్తుల పోస్టుల సంఖ్యను 24 నుండి 42 కి పెంచాలన్న చిరకాల డిమాండ్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేసారు.

కేంద్ర మంత్రిగా.. నేను గతంలో అనేకసార్లు న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని ప్రతిపాదనలు చేశానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

ఈ రోజు కేంద్ర న్యాయశాఖ మంత్రి.. నా సమక్షంలో ఫైలును ఆమోదించారన్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

న్యాయవాదుల సంఖ్య పెరగడంతో.. న్యాయ ప్రక్రియ మరింత వేగవంతం చేయడంలో తెలంగాణ హైకోర్టు ఖచ్చితంగా దేశానికి స్ఫూర్తిదాయకం అవుతుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Related posts

జగన్ సర్కార్ పనితీరుపై ఎన్నికల సంఘం సీరియస్

Satyam NEWS

ఎల్ జి పాలిమర్స్ డైరెక్టర్ల పాస్ పోర్టులు సీజ్

Satyam NEWS

ప్రజా సంగ్రామ యాత్రకు సంఘీభావం తెలిపిన కొలన్‌ శంకర్‌రెడ్డి

Satyam NEWS

Leave a Comment