40.2 C
Hyderabad
April 26, 2024 12: 45 PM
Slider కరీంనగర్

జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్ గా గుర్తించాలి : మహమ్మద్ రఫీ

#vemulawada pressclub demands journalists front warriars

ప్రత్యక కోవిడ్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలి…

రిపోర్టర్లకు వ్యాక్సిన్ తొందరగా అందించాలి.. జిల్లా కలెక్టర్ కు వినతి…

రాష్ట్రంలో దేశంలో కోవిడ్ -19 సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ అంజయ్య కు వేములవాడ ప్రెస్ క్లబ్ టీయూడబ్ల్యూజే హెచ్ 143 ఉపాధ్యక్షులు మహమ్మద్ రఫీ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ -19 సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ కరోనా వ్యాక్సిన్ వేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. అది కాకుండా జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తి మేరకు జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్లు గా గుర్తించి విలేకరులకు ప్రత్యక కరోనా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మెరుగైన సదుపాయాలు కల్పించాలని అన్నారు. అది కాకుండా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అక్రిడేషన్ కమిటీ ఏర్పాటు చేసి అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని అని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి పాశం తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Related posts

CTC అడిషనల్ డీసీపీ గా బాధ్యతలు స్వీకరించిన LC నాయక్

Satyam NEWS

బడ్జెట్ స్టోరీ: గ్రోతూ లేదు రూటూ లేదు

Satyam NEWS

హిందూత్వం అంటే మతం కాదు ధర్మం…

Satyam NEWS

Leave a Comment