ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేటి తెల్లవారుజామున భోగి వేడుకల్లో పాల్గొన్నారు. చెన్నైలో కుటుంబసభ్యులతో కలిసి భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంక్రాంతి రైతులకు సకల శుభాలు చేకూర్చాలన్నారు. భోగి పండుగ అంటే మంచిని ఆహ్వానించి చెడును వదిలి పెట్టడమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సంక్రాంతి అంటే పెద్దలను స్మరించుకుని వారు చూపిన మార్గాన్ని అనుసరించడమని పేర్కొన్నారు.
previous post