40.2 C
Hyderabad
April 26, 2024 11: 36 AM
Slider నల్గొండ

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ఆపాలి

#CPI Hujurnagar

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని, పోతిరెడ్డి రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంపుదలను నిలిపివేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో బుధవారం హుజూర్ నగర్ తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా జరిగింది. అనంతరం కార్యాలయ సూపరింటెండెంట్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యుడు పాలకూరి బాబు మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుదల, రాయలసీమ ఎత్తిపోతల పథకాల వల్ల ఉమ్మడి నల్లగొండ,మహబూబ్ నగర్,రంగారెడ్డి జిల్లాలు ఎడారిగా మారుతాయని, కనుక పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు వెంటనే నిలుపు చేయాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి ఓ 203 ను వెంటనే రద్దుకు అపెక్స్ కమిటీ నిర్ణయం తీసుకోవాలని కోరారు. గతంలో ఎన్ టి రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జల దోపిడీ జరిగిందని, తెలంగాణ ఏర్పడ్డ తరువాత కూడా మళ్ళీ అదే జల దోపిడీ జరుగుతోందని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో కంబాల శ్రీనివాస్, జడ శ్రీనివాస్, ఇందిరా వెంకటేశ్వర్లు, జక్కుల రమేష్, చిలక రాజు గంగులు, కుడితోటి స్వామి, అన్నెం వీరారెడ్డి, బండారు సైదయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మిర్చి పంటల్లో చీడపీడల వ్యాప్తి ఎదుర్కోవడానికి వ్యూహాలు

Satyam NEWS

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి చిన్నారెడ్డి

Satyam NEWS

మాదిగ జర్నలిస్టు జాతీయ మహాసభను జయప్రదం చేయండి

Satyam NEWS

Leave a Comment