29.7 C
Hyderabad
April 29, 2024 08: 34 AM
Slider ముఖ్యంశాలు

సుమారు 2 కోట్లు విలువగల గంజాయి ధ్వంసం

#ganja

రోజురోజుకు పెరిగిపోతున్న గంజాయి విక్రయాన్ని అడ్డుకట్ట  వేసే దిశగా ములుగు జిల్లాలో  ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. డ్రగ్ డీస్-పోసల్ కమిటీ ఆదేశాల ప్రకారం ములుగు పస్రా ఏటూర్ నాగారం మంగపేట వెంకటాపురం పరిధిలో సీజ్ చేసిన 757 కిలోల 625 గ్రాముల గంజాయిని నేడు జిల్లా ఎస్పీ గాష్ ఆలం, ఓ ఎస్ డి అశోక్ కుమార్, ఏ ఎస్ పి ఏటూరునాగారం సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కొందరు అక్రమార్జన లో భాగంగా గంజాయిని విక్రయిస్తూ  పట్టణ, గ్రామాలలోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ గంజాయి మత్తులోకి దించుతున్నారని తెలిపారు. అలాంటి వారిని అరికట్టడం కోసం జిల్లాలోని పోలీస్ అధికారులచే ఒక రహస్య బృందాన్ని ఏర్పాటు చేసినట్టుగా పేర్కొన్నారు. ఎవరైనా గంజాయి గానీ ఇతర మత్తు పదార్థాలు గానీ విక్రయిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

తమ పరిసరాలలో గంజాయిని విక్రయిస్తున్నట్టు అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీస్ లకు సమాచారం అందించి వారి పిల్లల బంగారు భవిష్యత్తు కాపాడుకోవాల్సిందిగా ఎస్ పి కోరారు. ఈ కార్యక్రమంలో డ్రగ్ డీస్ పోసల్ కమిటీ సభ్యులు(4సభ్యులు )ఎస్ పి గౌష్ ఆలం, ఓ ఎస్ డి అశోక్ కుమార్, ఏ ఎస్ పి ఏటూరునాగారం సిరిశెట్టి సంకీర్త్,  సి సి ఎస్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ దయాకర్ రిజర్వుడ్ ఇన్స్పెక్టర్ అడ్మిన్ సతీష్, ఆర్ ఐ వెంకటనారాయణ ఎస్ ఐ కమలాకర్ పాల్గొన్నారు.

Related posts

జగన్ పాలన లో సంక్షోభంలో పడ్డ సంక్షేమం

Satyam NEWS

మాండూస్ తుపాను పై సత్యం న్యూస్.నెట్ తో డీఆర్ఓ ఏమన్నారంటే….

Bhavani

ట్రాజెడీ: గుంటలో దిగి ఇద్దరు పిల్లల మృతి

Satyam NEWS

Leave a Comment