42.2 C
Hyderabad
April 26, 2024 16: 09 PM
Slider జాతీయం

గుజరాత్ సర్కార్ లో సమూల మార్పులు..?

#Narendra Modi

మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోయే గుజరాత్‌లో ప్రభుత్వాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్న బీజేపీ అధినాయకత్వం.. ఇందులో భాగంగా ఇప్పటికే ముఖ్యమంత్రిని మార్చింది. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్థానంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్ర పటేల్‌ను ముఖ్యమంత్రిగా నియమించి అందరినీ ఆశ్చర్యపరిచింది. భూపేంద్ర పటేల్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయగా.. ఆయన కేబినెట్‌లో మంత్రులుగా ఎవరికి స్థానం కల్పించాలనే అంశంపై ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సుదీర్ఘ కసరత్తు చేశారు. ఇందులో భాగంగా కొత్త సీఎం భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలో 24 మందికి స్థానం కల్పించారు. విజయ్ రూపానీ ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరించిన వాళ్లెవరికీ ఈసారి కేబినెట్‌లో చోటు కల్పించకపోవడం గమనార్హం.

కొత్తవారికే కేబినెట్ బెర్త్..

కొత్తగా గంధేవి ఎమ్మెల్యే నరేశ్ పటేల్, పార్ధి ఎమ్మెల్యే కనుభాయ్ దేశాయ్, విస్‌నగర్ ఎమ్మెల్యే హృశికేశ్ పటేల్, ధరి ఎమ్మెల్యే వి. కాక్డియా, కప్రాడా ఎమ్మెల్యే జితూ చౌదరి, నిక్లో ఎమ్మెల్యే జగదీష్ పంచల్, రాజ్‌కోట్‌కు చెందిన అరవింద్ రాయనీ, ఎమ్మెల్యేలు హర్ష్ సంఘ్వి, రాఘవ్‌జీ పటేల్, ముఖేష్ పటేల్, నిమిషా సుతార్, దుష్యంత్ పటేల్, గజేంద్ర పామర్, బ్రిజేష్ మెర్జా, ప్రదీప్ పామర్, దేవా మలం, పంకజ్ దేశాయ్, క్రితి సింహ్ రానా, అర్జున్ సింహ్ చౌహన్, కుబేర్ దిందోర్, ఆర్.సి మక్వానా మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 10 మందికి కేబినెట్ హోదా, 9 మంది సహాయ మంత్రి హోదా, 5 గురికి స్వతంత్ర హోదా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో ఈరోజు మరో ఆసక్తికర పరిణామం సంభవించింది. గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజేంద్ర త్రివేది రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అసెంబ్లీ సెక్రటరీకి పంపించారు.

స్పీకర్ రాజీనామాతో ..

ఆ తర్వాత పరిణామాలు కూడా వేగంగా మారిపోయాయి. స్పీకర్ రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చినట్టు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు. అయితే, రాజేంద్ర త్రివేది రాజీనామాకు గల కారణాలు ఇంతవరకు తెలియరాలేదు. రాజేంద్రకు మంత్రి పదవి ఇవ్వనున్నారనే వార్తలు వినిపించాయి. కొత్త స్పీకర్ ఎవరనే విషయాన్ని కాసేపట్లో ప్రకటించనున్నట్టు సమాచారం. విజయ్ రూపానీని ముఖ్యమంత్రిగా తప్పించి ఆయన స్థానంలో డిప్యూటీ సీఎంగా ఉన్న నితిన్ పటేల్‌ను సీఎం చేస్తారని వార్తలు వచ్చాయి. అలాంటి నితిన్ పటేల్‌కు కనీసం కొత్త మంత్రివర్గంలో చోటు కూడా దక్కకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న తరుణంలో బీజేపీ జాతీయ నాయకత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ, అమిత్ షా సుదీర్ఘ కసరత్తు చేసిన తరువాతే ఈ రకమైన నిర్ణయం తీసుకుని ఉంటారని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.

Related posts

మినీ ట్యాంక్ బండ్ లో శవమైకనిపించిన వివాహిత

Satyam NEWS

నవంబర్ 26న విహెచ్ పిఎస్ పోరాట దినోత్సవం  

Murali Krishna

ఇరకాటంలో కొడాలి నాని….

Satyam NEWS

Leave a Comment