39.2 C
Hyderabad
April 30, 2024 20: 39 PM
Slider విశాఖపట్నం

విశాఖ నగరంలో ఆసుపత్రులలో విజిలెన్స్ మెరుపు దాడులు

#vizaghospitals

విశాఖపట్నం నగరంలో పలు ఆస్పత్రుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు మంగళ వారం సోదాలు నిర్వహించారు. ఈ మేరకు నగరంలో సుమారు 15 నుండి 20 వరకు ఆస్పత్రుల్లో ఎటువంటి అనుమతులు లేకుండా కోవిడ్ చికిత్స ను అందిస్తునట్లు వరస ఫిర్యాదుల నేపథ్యంలో సోదాలు నిర్వహించమన్నారు.

అందులో  భాగంగా  విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అదనపు ఎస్పి జి.స్వరూపరాణి నేతృత్వంలో  కెకె ఆస్పత్రి , శ్రద్ధ , ఏ .ఎన్ .బీచ్ ఆస్పత్రి లో సోదాలు నిర్వహించారు.

ఆయా ఆస్పత్రి నిర్వాహకులు ఎటువంటి  కోవిడ్ చికిత్స అనుమతులు లేకుండా కోవిడ్ రోగులకు చికిత్స లు అందిస్తున్నట్లు గుర్తించామన్నారు.

ఈ మేరకు కెకె ఆస్పత్రి లో 12 , శ్రద్ద ఆస్పత్రి లో 16 , ఏ.ఎన్.బీచ్ ఆస్పత్రి లో ఇద్దరు రోగులను  గుర్తించినట్లు వెళ్లడించారు.

ఆస్పత్రి నిర్వాహకులు ఒకొక్క రోగి వద్ద బెడ్ కు సంబంధించి రోజుకు 17 వేల నుండి 20 వేల వరకు వసూలు చేస్తున్నారని, అదనంగా మందులకు 7 వేలు , ఆక్సిజన్ కు 3 వేలు , పరీక్షలకు 8 వేలు చొప్పున వసూలు చేస్తున్నట్లు దర్యాప్తులో  వెల్లడైందన్నారు.

ఆస్పత్రి నిర్వాహకులపై డి.ఎం .హెచ్.ఓ కు ఫిర్యాదు చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు. 

అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు మాత్రం  ఆస్పత్రి నిర్వాహకుల వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్థున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడ బెడ్ లు ఖాళీగా లేవని ఇటువంటి సమయంలో ప్రైవేటు ఆస్పత్రి వారు సేవలను అందించడం అభినందనియమని  అంటున్నారు.  

సోదాల్లో డిస్ట్రిక్  లెప్రసీ అధికారిణి డాక్టర్  సత్యవతి తో పాటుగా డ్రగ్ ఇనస్పెక్టర్ సునీతా,  విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ సి.ఐ లక్ష్మోజి తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాప్తాడుతో అంతర్జాతీయ స్త్రీ హింస నిర్మూలన దినోత్సవం

Bhavani

ఏలూరులో పకడ్బందిగా రాత్రి కర్ఫ్యూ అమలు

Satyam NEWS

ఇంద్ర‌కీలాద్రిపై గాయ‌త్రీదేవిగా దుర్గ‌మ్మ సాక్షాత్కారం

Satyam NEWS

Leave a Comment