33.7 C
Hyderabad
April 29, 2024 00: 47 AM
Slider ముఖ్యంశాలు

లాక్ డౌన్ విధింపుపై స్పందించిన సిఎం జగన్

#CM Jagan

దేశంలో కరోనా ఉద్ధృతి తీవ్రం కావడంతో అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ విధించగా, ఏపీ సర్కారుపైనా ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ, లాక్ డౌన్ విధిస్తే అధికంగా నష్టపోయేది ప్రజలేనని అన్నారు.

లాక్ డౌన్ తో ప్రభుత్వం కంటే ప్రజలే ఎక్కువగా ప్రతికూల ఫలితాలు చవిచూస్తారని వివరించారు. ప్రభుత్వానికి రూ.1 నష్టం జరిగితే, ప్రజలకు రూ.4 నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. లాక్ డౌన్ గురించి ఆలోచించేటప్పుడు ఇది ఎంతో కీలక అంశమని సీఎం అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో ఆక్సిజన్ లభ్యత గురించి చెబుతూ, ప్రస్తుతం రాష్ట్రానికి 340 మెట్రిక్ టన్నుల వరకు ఆక్సిజన్ వస్తోందని, ఇప్పటి అవసరాల దృష్ట్యా అది సరిపోతుందని అన్నారు.

Related posts

వెల్ కం: ప్లాస్టిక్ రహిత గ్రీన్ ఫుడ్ జోన్ ప్రారంభం

Satyam NEWS

ఒక్కో టిక్కెట్ రూ.5 లక్షలకు అమ్ముకున్నారు

Satyam NEWS

రాగల మూడు రోజుల్లో హైద‌రాబాద్‌లో వ‌ర్షాలు..!

Murali Krishna

Leave a Comment