38.2 C
Hyderabad
April 27, 2024 16: 07 PM
Slider విజయనగరం

Vijayanagaram police: మూడు చోరీలు… ముగ్గురు అరెస్టు!

#vijayanagarampolice

విజయనగరం వ‌న్ టౌన్  పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన  మూడు చోరీల‌లో ముగ్గురు నిందితులను పోలీసులు  ప‌ట్టుకునివారి వద్ద నుంచీ భారీ సొత్తునే రికవరీ చేసారు…పోలీసులు. ఈ మేర‌కు న‌గ‌ర డీఎస్పీ అనిల్  మీడియాకు ఇచ్చిన వివ‌రాల ప్ర‌కారం…న‌గ‌ర ప‌రిధిలోఓ చోట  సెల్ పాయింట్, మ‌రో ఇంటిలోను దొంగతనం, అలాగే ఓ వస్త్ర దుకాణంలో చోరీకి యత్నించిన ఇద్దరు నేరస్థులను, వారికి సహకరించిన మరో నిందితుడిని అరెస్టు చేసారు.

విజయనగరం లో ఇటీవల ఒక సెల్ ఫోను దుకాణంలోను, మరో ఇంటిలో నిందితులు దొంగతనాలకు పాల్పడి  2వేలు నగదు, 90వేలు విలువ చేసే ఆభరణాలు, టీవీ ఇతర వస్తువులను దొంగ‌లు అప‌హ‌రించుకుపోయారు. అదే విధంగా ఈ నెల 20న రాత్రి ఒక వస్త్ర దుకాణంలో నిందితులు చోరీకి యత్నించి, విఫలమయ్యారు.

ఈ నేరాలను తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ ఎం. దీపిక….వ‌న్ టౌన్  పోలీసులు మరియు సెంట్రల్ క్రైం పోలీసులను ఆనేరాలను చేధించాలని ఆదేశించడంతో, పోలీసులు జ‌రిగిన దొంగ‌త‌నాల‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. నేర స్థలంలో లభించిన ఆధారాలతో నిందితులను గుర్తించి, వారి ఆచూకీ పై నిఘా ఏర్పాటు చేసారు.

న‌గ‌రంలోని మర్రి చెన్నారెడ్డి కాలనీలో నివసిస్తున్న గుర్రపు శివ, ఉడా కాలనీ ఫేస్ కు  చెందిన యందవ శ్రీనివాస నాయుడులను అలియాస్ చిన్న శ్రీనులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పోలీసుల విచారణలో దొంగిలించిన వస్తువులను అమ్మేందుకుగాను అయ్యన్న పేటకు చెందిన మంత్రి రవి, ఉడా కాలనీలో ఉంటున్న మీసాల సాయి సుమంత్ కు ఇచ్చినట్లుగా నిందితులు అంగీకరించారు.

ల‌భించిన సమాచారంతో మంత్రి రవిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని, అతని వద్ద నుండి 55” సోనీ బ్రేవియా కలర్ టివిని, రెండు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లుగా డిఎస్పీ తెలిపారు.

పరారీలో ఉన్న నిందితుడి సాయి సుమంత్ కొరకు గాలింపు చేపడుతున్నామని, నిందితులను రిమాండుకు పంపామని తెలిపారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన అధికారులు, సిబ్బందిని డిఎస్పీ అభినందించారు. ఈ మీడియా సమావేశంలో వ‌న్ టౌన్ సీఐ జె.మురళి, ఎస్ఐ రాజా సుబ్రహ్మ‌ణ్యం ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ప్రకాశం జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు

Satyam NEWS

ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ నుండి స్వచ్ఛమైన గానుగనూనె

Satyam NEWS

కరోనా కోరల్లో చిక్కుకున్న ఒక చిన్న గ్రామం

Satyam NEWS

Leave a Comment