32.7 C
Hyderabad
April 27, 2024 01: 09 AM
Slider సంపాదకీయం

కరోనా కోరల్లో చిక్కుకున్న ఒక చిన్న గ్రామం

A village

ఒక గ్రామం మొత్తం ఇప్పుడు ప్రమాదంలో ఉంది. వారి తప్పేం లేదు. వారికి తెలియను కూడా తెలియదు. అయినా కరోనా మహమ్మారి వారిని కప్పేస్తున్నది. కమ్మేస్తున్నది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని ఒక గ్రామం అది.

ఆ గ్రామానికి చెందిన ఒక పెద్దాయన తనకు బాగా పరిచయం ఉన్న పెద్ద అధికారి ఇంటికి వెళ్లాడు. ఆ పెద్ద అధికారి కొడుకు లండన్ నుంచి వచ్చాడు.

చాలా కాలంగా కుటుంబ సాన్నిహిత్యం ఉండటంతో లండన్ నుంచి వచ్చిన పిల్లాడిని పలుకరిద్దామని అతను వచ్చాడు. చూశాడు. మాట్లాడాడు కబుర్లు చెప్పుకున్నారు. ఆ పెద్ద మనిషి ఒక రైసు మిల్లు యజమాని. ఎటూ టౌన్ కు వచ్చాం కదా అని కావాల్సిన ప్లేసుల్లో తిరిగాడు. గ్రామానికి తిరిగి వెళ్లాడు.

గ్రామానికి వెళ్లిన తర్వాత గ్రామంలోని రైతులను, సాటి మిల్లు యజమానులను కూడా కలిశాడు. ఇలా ఆ పెద్ద మనిషి 31 చోట్లకు తిరిగాడు. ఆ తర్వాత వచ్చింది పిడుగులాంటి వార్త. ఆ పెద్ద అధికారి కుమారుడికి కరోనా పాజిటీవ్ ఉంది. పెద్ద అధికారి కుటుంబం మొత్తానికి, ఆ ఇంట్లో పని చేసే వారికి కూడా కరోనా పాజిటీవ్ వచ్చింది.

ఇప్పుడు ఆ గ్రామం వంతు వచ్చింది. ఆ పెద్ద మనిషి తిరిగిన స్థలాలు ఏమిటి? కలిసిన వ్యక్తులు ఎందరు అనేది లెక్క తేలుస్తున్నారు. దాదాపు 151 మంది కరోనా అనుమానితులు తేలుతున్నారు. ఎందరికి కరోనా మహమ్మారి సోకిదో తెలియదు.

కేంద్ర నుంచి ప్రత్యేక వైద్య బృందాలు వస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇటీవల కేంద్రం పూర్తి లాక్ డౌన్ ప్రకటించిన జాబితాలోకి చేరింది ఈ కారణంతోనే. తెలిసి తెలియకుండా ఈ విధంగా కరోనా వైరస్ ను వ్యాప్తి చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి 14 రోజులు ఐసోలేషన్ లో ఉంటే ఎవరికి ప్రాబ్లం ఉండేది కాదు. (ఆ గ్రామం, ఆ అధికారి, ఆ పెద్ద మనిషి పేర్లను సత్యం న్యూస్ కావాలనే గోప్యంగా ఉంచింది. ఈ వార్త కేవలం ఏమి చేకూడదో చెప్పేందుకు తప్ప సంచలనం కోసం కాదు. భయాందోళనలు రేకెత్తించేందుకు ఉద్దేశించింది కాదు.)

Related posts

భగ్గుమన్న భాజపా శ్రేణులు: దిష్టిబొమ్మల దహనం

Satyam NEWS

వైఎస్ జగన్ వ్యవహార శైలిపై కేఏ పాల్ ఆగ్రహం

Satyam NEWS

“క్రాక్” సినిమాలో మాదిరిగా మిస్సింగ్ కేసును ప‌ట్టుకున్న డీఎస్పీ….!

Satyam NEWS

Leave a Comment