39.2 C
Hyderabad
April 28, 2024 14: 42 PM
Slider విజయనగరం

వయసులో మైన‌ర్లు…జల్సాల కోసం దొంగ‌త‌నాలు…!

#vijayanagaram police

జ‌ల్సాల కోస‌మో లేక‌..తెచ్చిన డ‌బ్బు తిరిగి ఇచ్చేయ‌డం కోస‌మే  అదీ కాక‌…దొంగ‌త‌న‌మే వృత్తి గా ఎంచుకోవ‌డం కోస‌మో మైన‌ర్లు దొంగ‌లు మారుతున్నారు.గ‌డ‌చిన ఏడాది నుంచి విజ‌య‌న‌గ‌రం జిల్లాలో జ‌రిగిన దొంగ‌త‌నాల కేసుల‌ను పోలీసులు చాక‌చ‌క్యంగా ప‌ట్టుకుంటున్న అందులో ఎక్కువ మంది మైన‌ర్లు ఉండటం విశేషం.

తాజాగా విజ‌య‌న‌గ‌ర ప‌రిధిలో పూల్ బాగ్ ,నాగ‌వంశ‌పువీధి రాజీవ్ న‌గ‌ర్ కాల‌నీలలో  ఉంటున్న ముగ్గురు దొంగ‌లను ప‌ట్టుకున్నారు….టూటౌన్ పోలీసులు. ఈ మేర‌కు గంట‌స్థంబం వ‌ద్ద సెంట్ర‌ల్ క్రైమ్ స్టేష‌న్ లో ఇంచార్జ్ డీఎస్పీ అనిల్ ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆ విష‌యం స్ప‌ష్ట‌మైంది.

ఇటీవ‌ల మూడు ఇండ్ల‌లో  దొంగ‌త‌నం జ‌ర‌గ‌డం దానిపై పోలీసులకు పిర్యాదు చేసిన పిమ్మ‌ట అప‌హ‌రించ‌బ‌డిన సొత్తు అధికంగా ఉండటంతో సీసీఎస్ పోలీసులు ద‌ర్యాప్తు్ ప్రారంభించ‌డంగా ముగ్గురు ప‌ట్టుబ‌డ్డారు. సాయికుమార్,దేవీ ప్ర‌సాద్ ల‌తో పాటు మైన‌ర్  భ‌వానీ ప్ర‌సాద్ ను ప‌ట్టుకున్నారు. వాళ్ల వ‌ద్ద  నుంచీ 20 వేలు న‌గ‌దు తోపాటు కేజీ  బ‌రువు గ‌ల వెండిని సొత్తును స్వాధీనం చేసుకున్నారు…సీసీఎస్ పోలీసులు.

ఎల్ హెచ్ఎంఎస్ విధానంతో దొంగ‌త‌నాల‌కు చెక్-డీఎస్పీ

ఈ సంద‌ర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ కొత్త‌గా వ‌చ్చిన ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశాల మేర‌కు  లోక‌ల్ హౌస్,మేనేజ్ మెంట్ సిస్ట‌మ్ ను అమ‌లులోకి తెస్తున్నామ‌ని చెప్పారు.  ఎవ‌రైనా ఇల్లొదిలి బ‌య‌ట ఊర్ల‌కు వెళ్లి న‌ట్ల‌యితే ఈ విధానం ద్వారా స్థానికంగా సీసీ కెమారాల ద్వారా అగంత‌క‌లు ఎవ‌రు..? ఇంట్లో ఎవ‌రు ఉన్నారు..?  అస్స‌లు దొంగ‌త‌నం జ‌రిగిందా…?  లేక ఇంట్లో వారే పోయిన‌ట్టు ఫిర్యాదు చేసారా అన్న విష‌యాలను కనిపెడుతున్న‌ట్టు డీఎస్పీ అనిల్ తెలిపారు.

ఇక దొంగ‌త‌నాలు చేసిన వారిలో మైన‌ర్లు కూడా ఉంటున్నార‌ని క‌న్న‌వాళ్లు  త‌మ పిల్ల‌లను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తూ ఉండాల‌ని  డీఎస్పీ తెలిపారు.ఈ మీడియా స‌మావేశంలో సీఐలు కాంతారావు,శ్రీనివాస‌రావు, వ‌న్ టౌన్,టూటౌన్ సీఐలు ముర‌ళీ,లక్ష్మ‌ణ‌రావులు తో పాటు ఎస్ఐలు బాలాజీ,ర‌వీంద్ర‌లు ఐడీ పార్టీ సిబ్బంది ప్ర‌సాద్ లు ఉన్నారు.

Related posts

నివర్ తుపాను తో నష్టపోయిన రోడ్లకు మార్చిలోపు మరమ్మతులు

Satyam NEWS

రహస్యంగా బాల్యవివాహాలు చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు

Satyam NEWS

కోదండ రామాల‌యం పునః నిర్మాణానికి మంత్రి అల్లోల‌ భూమి పూజ

Satyam NEWS

Leave a Comment