37.2 C
Hyderabad
May 1, 2024 14: 29 PM
Slider విజయనగరం

Vijayanagaram police: కాఠిన్యం 50 శాతం మానవత్వం 100 శాతం

#VijayanagaramPolice

రాష్ట్రంలో పగటి పూట 8గంటల కర్ఫ్యూ సడలింపు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ని అన్ని జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు సమయంలో పోలీసులు కాస్త మెతక వైఖరి నే అవలంబిస్తున్నారు.

కానీ విజయనగరం జిల్లాలో మాత్రం కాస్త సీరియస్ గానే పోలీసులు కర్ఫ్యూ సడలింపు అనంతరం లాక్ డౌన్ ను పకడ్బందీగా నే అమలు చేస్తున్నారు.

కారణం లేకుండా అదీ సరైన ఆధారం చూపించనదే ఏ ఒక్కరినూ బయటకు రానివ్వటం లేదు. మరీ ముఖ్యంగా విజయనగరం జిల్లా కేంద్రంలో డీఎస్పీ అనిల్ ఆదేశాలతో నగర వన్ టౌన్, టూటౌన్ సీఐలు హడలెత్తిస్తున్నారు.

మరీ ముఖ్యంగా వన్ టౌన్ సీఐ మురళీ…తన సిబ్బంది తోనూ అదే విధంగా ఐడీ పార్టీ సిబ్బంది తో లాక్ డౌన్ సమయంలో బయటకు వచ్చిన వారి సోదాలు చేసి..తనిఖీలు నిర్వహించి అవసరమనుకుంటే స్టేషన్ కు పంపించి…వాహనాలను ఉంచే విధంగా చర్యలు చేపడుతున్నారు.

మరోవైపు ట్రాఫిక్ డీఎస్పీ మోహనరావు ఆధ్వర్యంలో కూడా ట్రాఫిక్ సిబ్బంది దాలినాయుడు, నూకరాజు, కానిస్టేబుళ్లు విజయ్ లు దగ్గరుండీ లాక్ డౌన్ సమయంలో రోడ్లమీద తిరిగే వాహనాలను నిలుపుదల చేయించి వారిలో అవగాహన కల్పించే చర్యలు చేపడుతున్నారు.

ఈ క్రమంలోనే మానవత్వాన్ని చూపెడుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ని బాలాజీ జంక్షన్ వద్ద ఓ నిండు గర్భిణీ చంటిపాప ,భర్తతో కోట నుంచీ నడుచుకురావడం చూసి..అక్కడే విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ అనిల్ తో పాటు ట్రాఫిక్ డీఎస్పీ కూడా చలించిపోయారు.

తక్షణమే డీఎస్పీ ఆదేశాలమేరకు సిబ్బంది దాలినాయుడు..ఆ కుటుంబాన్ని…ఓ ఆటోలో దగ్గరుండి ఎక్కించి వారి గమ్యస్థానమైన తోటపాలెంకు పంపించి…ఖాకీలలో మానవత్వ విలువలు ఉంటాయని..మాకు కూడా కుటుంబం విలువలు తెలుసునని కార్యచరణ రూపంలో చేసి చూపించారు.

ఈ మేరకు సత్యం న్యూస్.నెట్ పోలీసులు చూసిన మానవత్వ చర్యలకు సలాం చేస్తోంది.

Related posts

పార్లమెంట్ నియోజకవర్గ విస్తారక్ లతో బండి సంజయ్ భేటీ

Bhavani

ఉదారత చాటిన దళిత గిరిజన ప్రజాప్రతినిధులు

Satyam NEWS

కెమికల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన మరో వాహనం

Bhavani

Leave a Comment