30.7 C
Hyderabad
April 29, 2024 03: 18 AM
Slider విజయనగరం

థ‌ర్డ్ వేవ్ తో హెచ్చ‌రిక‌ల‌తో బందోబ‌స్తు ముమ్మ‌రం చేసిన పోలీస్ శాఖ‌….!

#vijayanagarampolice

దేవుడు శాసించాడు…అరుణా చ‌లంపాటిస్తాడు..అన్న సినిమాలో డైలాగ్ మాదిరిగానే  జిల్లాకు వ‌చ్చిన లేడీ పోలీస్ బాస్ దీపికా ఎం.పాటిల్ ఇచ్చిన  ఆదేశాల‌తో జిల్లా వ్యాప్తంగా ప్ర‌తీ పీఎస్ ప‌రిధిలో సంబంధిత శాఖా సిబ్బంది…అక‌స్మాత్తుగా త‌నిఖీలు నిర్వ‌హించారు .ఒక్క రోజులో ఒకేసారి  నాకాబంధీ నిర్వ‌హించి…40 అక్ర‌మ మ‌ధ్య కేసులు,అలాగే మాస్క్ లు  ధ‌రించని వారిపై 463 కేసులు న‌మోదు చేసి వాళ్ల‌వ‌ద్ద నుంచీ  దాదాపు  ల‌క్ష రూపాయ‌లు వ‌సూలు చేసారు…పోలీసులు.

జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు, జూదం నియంత్రణకు, సారా, మద్యం, నిషేధిత ఖైనీ, గుట్కాలు అక్రమ రవాణాను అరికట్టేందుకు, కోవిడ్ నిబంధనలు అరికట్టే వారిపైన కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా జూదం ఆడే వారిపై దాడులు నిర్వహించి, 5 కేసులు నమోదు చేసి, 39మందిని అదుపులోకి తీసుకొని, వారి నుండి 47వేల నగదు, 8 బైక్  ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

అలాగే నిషేధిత ఖైనీ, గుట్కా రవాణ చేస్తున్న ఒక వ్యక్తిని బుదరాయవలస పోలీసులు అదుపులోకి తీసుకొని, అత‌ని వద్ద నుంచీ.1208 విలువైన నిషేధిత గుట్కా లను స్వాధీనం చేసుకున్నారు. ఇక క‌రోనా నిబంధనలు పాటించకుండా మాస్క్ ధరించని వాహనదారులపై 463 కేసులు నమోదు చేసి, వారిపై 47 వేల‌  ఈ-చలానాలు విధించారు.

ఇక క‌రోనా 2వ వేవ్ లో నిబంధనలు పాటించని వారిపై ఇంతవరకు 1083 కేసులను 1740మందిపై నమోదు చేసారు. ఇక‌నిబంధనలు పాటించని వారిపై 20 వేల‌,620 మందిపై ఎం.వి. కేసులు నమోదు చేసి,  62 ల‌క్ష‌లు,21 వేల ,479 లను ఈ-చలానాలు గా విధించి, 186 వాహనాలను సీజ్ చేశారు. 

ప్రజల్లో దిశా యాప్ పట్ల అవగాహన కల్పిస్తూ, 463 మంది తమ స్మార్ట్ ఫోనుల్లో దిశా యాప్ డౌన్లోడ్ చేసుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.మొత్తం మీద  జిల్లా వ్యాప్తంగా దేవాలయాలు, మసీదులు, చర్చిలు మరియు ఇతర ప్రార్థన మందిరాల భద్రతకు ప్రాధాన్యత కల్పిస్తూ, సిసి కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు, వాటి పనితీరు, ప్రార్థన మందిరాల భద్రతను పర్యవేక్షించేందుకు  బీట్లు, గస్తీని నిర్వహించారు.

Related posts

స్ఫూర్తి నివ్వు

Satyam NEWS

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం చేయాలి

Satyam NEWS

టీడీపీ సంచలనం: సత్తెనపల్లి కి కన్నా

Satyam NEWS

Leave a Comment