40.2 C
Hyderabad
April 26, 2024 14: 19 PM
Slider విజయనగరం

Vijayanagaram Police: 2 కోట్ల విలువైన 29 కార్లును స్వాధీనం

#vijayanagaram police

విజయనగరం జిల్లా పోలీసులు… కేసులను చేధించడంలో ముందుంటున్నారు. జిల్లా ఎస్పీ రాజకుమారీ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది చాకచక్యంగా పని చేస్తున్నారనటానికి పార్వతీ పురం కేసును చేధించడమే నిదర్శనం. డీఎస్పీ సుభాష్ ఆధ్వర్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ పోలీసులు 29 కార్లను స్వాధీనం పరచుకున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ని డీపీఓలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రాజకుమారీ… దొంగతనం ఎంఓను తెలుపుతూ నిందితులను చూపించారు.

సిక్కోలు జిల్లా సీతంపేట మండలం తురాయివలస గ్రామానికి చెందిన పిన్నింటి రాజేష్ అనే వ్యక్తి పార్వతీపురం పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేస్తూ పార్వతీపురం పట్టణం వైకేఎం కాలనీకు చెందిన మర్రాపు చంద్రమౌళి  అనే వ్యక్తి తన షిప్ట్ విడిఐ కారు ఎపి 394జి 3846ను ప్రతీ నెలకు 29 వేలు అద్దె చెల్లించేందుకు లోలుగ శివ రామకృష్ణ (ఎ-2) అనే వ్యక్తి ద్వారా అగ్రిమెంటు కుదుర్చుకున్నాడని తెలిపాడు.

అద్దెను గత కొన్ని నెలలుగా చెల్లించకపోవడంతో తన కారును అప్పగించాలని కోరినప్పటికీ, మGపు చంద్రమౌళి (ఎ-1) ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి, ఆరా తీయడంతో తన కారును నారాయణపురంకు చెందిన ఒక వ్యక్తి వద్ద తనఖా పెట్టినట్లు తెలిసిందని చెప్పాడు.

తన కారు విలువ 9. 5 లక్షలు ఉంటుందని, తన కారును, అద్దెను ఇప్పించి, న్యాయం చేయాల్సిందిగా కోరారు.

ఈ ఫిర్యాదుపై పార్వతీపురం పట్టణ పోలీసులు క్రైం నంబరు. 136/2021 సెక్షన్స్ 420, 406 ఐపిసి గా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.ఈ ఫిర్యాదుపై విచారణ ప్రారంభించిన పార్వతీపురం పట్టణ పోలీసులు నిందితుడు మర్రాపు చంద్రమౌళి (ఎ-1)ని పార్వతీపురం వైకేఎం కాలనీలోని వారింటి వద్ద అదుపులోకి తీసుకొని, విచారణ చేశారు.

నిందితుడు వేరువేరు వ్యక్తుల నుండి 29 కార్లను అద్దెకు తీసుకొని, వాటిని తన అవసరాల కొరకు ఇతరుల వద్ద .2-2.5 లక్షలకు తనఖా పెట్టినట్లుగా అంగీకరించాడు. బత్తిలి, పాతపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో తన స్నేహితులు బొబ్బిలికి చెందిన సీమంతుల రవి (ఎ-2), సీతంపేటకు చెందిన లోలుగ శివ రామకృష్ణ (ఎ-3)లు సహకారంతో కార్లను అద్దెకు తీసుకొని, వాటిని పార్వతీపురం, బొబ్బిలి, బలిజిపేట ప్రాంతాల్లోని ఇతరుల వద్ద .2 నుండి 2.5 లక్షలకు తనఖా పెట్టి, వారి నుండి డబ్బులు తీసుకొని తన అవసరాలను తీర్చుకొనే వారన్నారు.

నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం పార్వతీపురం పీఎస్ పరిధిలో 9 కార్లును, బొబ్బిలి పీఎస్ పరిధిలో 4 కార్లను, బలిజిపేట పిఎస్ప రిధిలో 10 కార్లను, విజయనగరం పట్టణంలో 6 కార్లును (మొత్తం 29 కార్లును) స్వాధీనం చేసుకున్నారు.

పార్వతీపురం పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్న 29 కార్లలో 3 కార్లు పార్వతీపురం పట్టణ పిఎస్ కు సంబందించినవి గాను, 10 కార్లును బత్తిలి పోలీసు స్టేషనుకు సంబంధించినవి గాను, 6 కార్లు సీతంపేట పోలీసు స్టేషనుకు సంబంధించినవి గాను, 1 కారు చీడికాడ పోలీసు స్టేషనుకు సంబంధించినది గాను, 2 కార్లు పిఎం పాలెంకు సంబంధించినవి గాను, 1 కారు ఎంవీపీ కాలనీ పోలీసు స్టేషనుకు సంబంధించినవిగా ఇప్పటి వరకు గుర్తించామన్నారు.

ఇంకనూ మిగిలిన 6 కార్లు ఎవరికి చెందినవో తెలియలేదన్నారు. ఈ 29 కార్లును మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకోవడం జరిగిందని, స్వాధీనం చేసుకున్న కార్లును గురించి సంబంధిత స్టేషను హౌస్అ ధికారులకు తదుపరి చర్యలు తీసుకొనేందుకు సమాచారం అందించామని, స్వాధీనం చేసుకున్న 29 కార్ల విలువ 2 కోట్లు ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈ కేసులో నిందితులైన పార్వతీపురంకు చెందిన మర్రాపు చంద్రమౌళి (ఎ-1), శ్రీకాకుళం జిల్లా సీతంపేటకు చెందిన లోలుగ శివ రామకృష్ణ (ఎ-3)లను పార్వతీపురం పట్టణ పోలీసులు అరెస్టు చేయగా, బొబ్బిలికి చెందిన సీమంతుల రవి (ఎ-2) ప్రస్తుతం పరారీలో ఉన్నారని జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు.

స్వాధీనం చేసుకున్న కార్ల వివరాలివే… (1) ఎపి 39బిఎఫ్ 5512 స్విఫ్ట్ విడిఐ (2) ఎపి 39డబ్ల్యు 4973 స్విఫ్ట్ డిజైర్ (3)ఎపి 39బియు 3381 ఎర్టిగా (4) ఎపి 39 టిఎ 6316 స్విఫ్ట్ (5) ఒడి 10కే 6383 ఎర్టిగా (6) ఎపి 39డిఎ 1145 స్విఫ్ట్ డిజైర్ (7) ఎపి 39టిపి 6301 స్విఫ్ట్ డిజైర్ (8) ఎపి 39 పిఎన్ 0594 స్విఫ్ట్ డిజైర్ (9) ఎపి టిఆర్ 39 హెచ్ఎఫ్ 2744 వెన్యూ (10) ఎపి 39టిఎ 9790 స్విఫ్ట్ డిజైర్ (11) ఎపి 31సిడబ్ల్యు 0961 ఐ10 (12) ఎపి 30విఎస్ టిఆర్ 8953 ఎర్టిగా (13) ఎపి 39 ఎఫ్ఎక్స్ 8369 ఎర్టిగా (14) ఒక 10ఎక్స్ 6388 ఎర్టిగా (15) ఎపి35ఎఎన్ 4164 స్విఫ్ట్ డిజైర్ (16) ఎపి 31డిటి 1049 ఐ20 (17) ఎపి 39టిఎం 6173 స్విఫ్ట్ డిజైర్

(18) టీఎస్ 04ఎం 3777 ఇన్నోవా (19) ఎపి 35టిఆర్ స్విఫ్ట్ బ్లూ (20) ఎపి 31సిపి 8778 స్విఫ్ట్ విడిఐ (21)ఎపి 31టిఆర్ మహేంద్ర టియువి 300 (22) ఎపి 39 టిజె 4735 మహేంద్ర ఎక్స్ యువి 500 (23) ఎపి 31 డిఎ 5393 ఆల్టో (24) ఎపి 394జి 3846 స్విఫ్ట్ విడిఐ (25) ఎపి 38ఈబి 1987 ఎర్టిగా (26) ఎపి 35ఎఎన్ 4164 డిజైర్ (27) టీఎస్ 04 ఈక్యూ3777 ఇన్నోవా (28) ఎపి 31సిపి 8778 (29) ఎపి 31డిఎ 5393

మారుతీ సుజుకీ షిఫ్ట్ కార్లు – 6

మారుతీ సుజుకీ షిఫ్ట్ డిజైర్ కార్లు – 8

మారుతీ సుజుకీ ఎర్టిగా కార్లు

మారుతీ సుజుకీ ఆల్టో కార్లు – 2

హుండాయ్ వెన్యూ కారు – 1

హుండాయ్ ఐ10 – 1

హుండాయ్ ఐ20 – 1

టోయోటా ఇన్నోవా కార్లు – 2

మహేంద్ర టియువి 300 కారు – 1

మహేంద్ర ఎక్స్ యువి 500 కారు – 1

ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్, పార్వతీపురం సీఐ సిహెచ్. లక్ష్మణరావు, పార్వతీపురం పట్టణ ఎస్ఐ జి.కళాధర్, పార్వతీపురం రూరల్ ఎస్ఐ జి.వీరబాబు, బత్తిలి ఎస్ఐ కె.వి.సురేష్, పార్వతీపురం పట్టణ ఎఎస్ఐ వి.రవి, పార్వతీపురం పట్టణ కాని స్టేబులు కె.శ్రీనివాసరావు, బత్తిలి కానిస్టేబుళ్ళు ఎ.రాంబాబు, పి.రమణలను జిల్లా ఎస్పీ అభినందించారు.

Related posts

శ్రీకాకుళం సన్యాసిరావును సత్కరించిన ప్రెస్ అకాడమీ సెక్రటరీ

Bhavani

ములుగులో STU TS సభ్యత్వ నమోదు కార్యక్రమం

Satyam NEWS

అప్పాయింట్ మెంట్: ఎయిమ్స్ బోర్డు సభ్యుడుగా బండ ప్రకాష్

Satyam NEWS

Leave a Comment